ఎర్రచందనం దొంగా? లారీ డ్రైవరా?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్తూరు యాస నేపథ్యం.. ఎర్ర చందనం దొంగల కథాంశంతో ఈ చిత్రాన్ని థ్రిల్లర్ ఫార్మాట్ లో సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కథాంశంతో పాటు.. నేటివిటీ.. కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కి సంబంధించి సుక్కూ ఎంతో కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ గురించి జనం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. బన్ని ఈ చిత్రంలో ఎర్రచందనం తరలించే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడు. అయితే అతడు ఎవరి కోసం పని చేస్తాడు? అన్నది సస్పెన్స్. ఇక బన్ని గెటప్ ఈ చిత్రంలో రఫ్ అండ్ ఠఫ్ గా ఉంటుందని తెలుస్తోంది. అల.. వైకుంఠపురములో గెటప్ తో పోలిస్తే పూర్తి వైవిధ్యం చూపించబోతున్నాడట.

నేటివిటీ టచ్ తో ఎమోషనల్ ఎంటర్ టైనర్లు తెరకెక్కించడం సుక్కూ శైలి. ఇంతకుముందు రంగస్థలం చిత్రంతో చేసిన మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తాడనే అభిమానులు భావిస్తున్నారు. బన్నీకి ఇండస్ట్రీ హిట్ కొట్టే యోగం ఉందా లేదా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి బన్ని నటించిన అల వైకుంఠపురములో ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్ని నిలువనీయడం లేదు. ఈ సంక్రాంతి పోటీలో విన్నర్ బన్నీనే అంటూ సంబరాలు జరుపుకుంటున్నారంతా. మరో నేటి సాయంత్రం ప్రివ్యూల నుంచి అల.. ఫస్ట్ రిపోర్ట్ రానుంది.
Please Read Disclaimer