బాబోయ్ అలాంటివి నావల్ల కాదు : బన్నీ

0

అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని చేసిన అల వైకుంఠపురంలో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమాపై మరియు విజయ్ దేవరకొండ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ రెడ్డి వంటి స్క్రిప్ట్ నావద్దకు వస్తే ఖచ్చితంగా నేను చేయలేను అని చెప్తాను. ఎందుకంటే నేను అంత బోల్డ్ స్క్రిప్ట్ ను చేయలేను.

అలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవాలంటే ఘట్స్ కావాలి. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని ముందే ఊహించడం కష్టం. అందుకే అలాంటి పాత్రను.. అలాంటి సినిమాను చేయాలంటే మామూలు విషయం కాదు. అలాంటి సినిమాలు నన్ను చేయమంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించకుండా బాబోయ్ అలాంటివి నా వల్ల కాదు అని చెప్పేస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంటుందని కూడా బన్నీ అన్నాడు.

ఇక విజయ్ దేవరకొండ ఫాలో అయ్యే స్టైలిష్ కాస్ట్యూమ్స్ పై కూడా బన్నీ ప్రశంసలు కురిపించాడు. చాలా కంఫర్ట్ గా మరియు స్టైలిష్ గా విజయ్ కాస్ట్యూమ్స్ ఉంటాయన్నాడు. కాని అలాంటి స్టైలిష్ డ్రస్ లు ట్రై చేయడం నా వల్ల కాదన్నాడు. కొన్నాళ్ల క్రితం విజయ్ నాకు అతడి బ్రాండ్ కాస్ట్యూమ్స్ ను పంపించాడు. కాని వాటిని ఇప్పటి వరకు ట్రై చేయలేదని బన్నీ అన్నాడు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కూడా మంచి కాస్ట్యూమ్స్ ను ఉపయోగిస్తాడని అన్నాడు. బాలీవుడ్ లో పలువురు స్టార్స్ స్టైలింగ్ విషయంలో ఆదర్శనీయం గా ఉంటారని బన్నీ చెప్పుకొచ్చాడు. కాని తనకు మాత్రం చాలా ఫార్మల్ గా ఉండేవి ఎక్కువ ఇష్టమన్నాడు.
Please Read Disclaimer