లవ్ లీ బ్రిటీషర్.. క్యూట్ ఝాన్సీ రాణి

0

వారసులు అల్లు అయాన్.. అల్లు అర్హ లకు సంబంధించిన సెలబ్రేషన్స్ ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో బన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ అల్లు అర్హ అల్లరిని.. అయాన్ క్యూట్ చిలౌట్ మూవ్ మెంట్స్ ని బన్ని అభిమానుల కోసం షేర్ చేశారు. తాజాగా 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అయాన్- అర్హ ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోల్ని బన్ని షేర్ చేశారు.

ఈ ఫోటోల్లో అల్లు అయాన్ గన్ చేతపట్టి ఒక బ్రిటీషర్ (తెల్ల దొర) లుక్ లో కనిపిస్తే .. కరవాలం చేతపట్టిన అల్లు అర్హ ఝాన్సీ లక్ష్మీభాయ్ ని తలపించింది. ఈ వేషధారణల్లో లవ్ లీ అయాన్ .. క్యూట్ అర్హ ఎంతో ముచ్చటగొలుపుతున్నారు. ముఖ్యంగా అర్హ ఆ సాంప్రదాయ చీరకట్టులో ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుల గెటప్ అంటేనే ఆసక్తికరం.

అల్లు అర్జున్ ప్రస్తుతం `అల వైకుంఠపురంబులో` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్ ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అభిమానుల ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్-హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Please Read Disclaimer