రేసుగుర్రం 2.0 అవుతావా?

0

సౌత్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రసుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు అయాన్ లాంటి చురుకైన కుర్రాడికి తండ్రిగా అమితానందాన్ని పొందుతున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ని ఫుల్ ఛీర్ చేస్తున్న బన్ని రేర్ మూవ్ మెంట్ ని ఫోటోల రూపంలో క్యాప్చుర్ చేస్తున్నాడు. అల్లు అయాన్ స్కూల్ సెలబ్రేషన్ టైమ్ లో దిగిన అయాన్ ఫోటోని బన్నీ తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు కొడుకు విషయంలో గర్వపడుతున్నానంటూ ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు. ఇప్పుడీ ఫోటో.. బన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంతకి బన్నీ తనయుడి విషయంలో ఎందుకు అంత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు? అంటే…. అయాన్ స్కూల్ లో రకరకాల యాక్టివిటీస్ లో ది బెస్ట్ గా నిలుస్తున్నాడట. మాదాపూర్ లోని బోధి వ్యాలీ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఆ స్కూల్ లో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేట్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఆ వేడుకలో భాగంగా అయాన్ అచ్ఛం డాడీ అల్లు అర్జున్ తరహా స్టయిల్ లో స్టేజ్ పై నిలబడ్డాడు. ఆ ఫేస్ లో ఆనందం… ఎనర్జీ అంతకుమించి ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. వైట్ షర్ట్ విత్ బ్లూ కలర్ సూట్.. బ్లూ కలర్ ప్యాంట్ తో తళతళా మెరిసాడు. ఈ ఫోటోని బన్నీ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూ .. “స్కూల్లో బాగా రాణించినందుకు అయాన్ నీ విషయంలో చాలా గర్వపడుతున్నా. మా అబ్బాయి లైఫ్ పునాదికి సంబంధించిన మంచి విషయాలను నేర్పిస్తున్న బోధి వ్యాలీ స్కూల్ టీచర్లకి నా ధన్యవాదాలు. ఈ స్కూల్ లో చేర్పించడం తల్లిదండ్రులుగా ఆనందపడుతున్నాం. ఇది నేను గర్వపడే రోజు“ అంటూ బన్నీ పేర్కొన్నాడు.

నెటిజనులు అయాన్ ఫోటోని చూసి ఇక సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టే.. ఎంట్రీ ఎప్పుడు? బన్నీ ఇక తనయుడిని సినిమాల్లో బాలనటుడిగానూ పరిచయం చేస్తాడా? అంటూ ఫ్యాన్స్ ఉత్సాహం కనబరుస్తున్నారు. అయాన్ ఎంట్రీ ఖరారైనట్టేనా.. సుక్కూతో సినిమాలో ఉంటాడా? అని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అందరు అన్నట్టుగానే బన్ని 2.0 గా అయాన్ తెరంగేట్రం చేస్తాడా? అన్నది చూడాలి. ఎందుకంటే “మేం చిత్ర రంగంలో ఉన్నాం. మాకు సినిమా తప్ప మరేది తెలియదు. నాతో పాటు మా అబ్బాయి కూడా సినిమాలే చేస్తాడు“ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో బన్నీ చెప్పాడు కాబట్టి ఆ ఘడియ కోసమే అంతా వెయిటింగ్. త్వరలోనే అయాన్ నటుడిగా ఎంట్రీ దాదాపు ఖరారే అనే టాక్ ఫ్యాన్స్ లో నడుస్తోంది. అయాన్ బరిలో దిగితే బన్ని 2.0 లా .. ఎనర్జిటిక్ రేసుగుర్రంలా దూసుకొస్తాడేమో చూడాలన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer