సూపర్ మార్కెట్లో తళుక్కుమన్న స్టైలిష్ స్టార్..

0

కరోనా ఎఫెక్ట్ కారణంగా జనాలంతా ఎవరి ఇళ్లకు వారు లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వలన రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల కోసం – మెడిసిన్స్ కోసం బయటకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీ నుండి సామాన్యుల వరకు అంతా ఒక్కటే అయిపోయింది. తాజాగా ఇలాంటి ఇన్సిడెంట్ ఒక సెలబ్రిటీకి జరిగింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యాడు. అదేంటి ఆయన మార్కెట్ కి రావడం ఏంటని.. ఆశ్చర్యపోకండి. ఆయన కూడా ఆయనకు అవసరమైన వస్తువులను కొనుక్కెళ్ళడానికే వచ్చాడు. మొహానికి ఫేస్ మాస్క్ – యెల్లో టీషర్ట్ – బాక్సర్ షాట్ వేసుకొని ఆయన సూపర్ మార్కెట్ లో దర్శనమిచ్చాడు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఒక సెలబ్రిటీ తనంతట తానే ఇలా ఎవరు బాడీగార్డ్ లేకుండా బయటికి రావడం రేర్ గా జరుగుతుంది. కరోనా కారణంగా సెలబ్రిటీ నుండి సామాన్యుడి వరకు అందరూ ఒకటే అని తెలిసిపోతుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-