సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

టాలీవుడ్ దర్శకులందరిని ఒక్క చోటుకు చేర్చిన బన్నీ

0

అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఆయన సొంత బ్యానర్లో ఆయన తండ్రి నిర్మాణంలో రూపొందడటంతో ఆయనకు చాలా ప్రత్యేకమైన విజయంగా పేర్కొంటున్నాడు. అల్లు అర్జున్ చేసుకుంటున్న సక్సెస్ వేడుకలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. నిన్న ఆదివారం ఇండస్ట్రీకి చెందిన పలు వర్గాల వారికి బన్నీ పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ పార్టీలో ఎంతో మంది దర్శకులు పాల్గొన్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది టాలీవుడ్ లోని ఫేమస్ దర్శకులు. దర్శకులందరిని ఒకే చోటుకు తీసుకు వచ్చినందుకు బన్నీకి థ్యాంక్స్ అంటూ చాలా మంది ఆయా దర్శకుల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ తన సక్సెస్ పార్టీని ఈ దర్శకులకు ఇవ్వడంతో వారంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోలని దర్శకుల మొహాలు చూస్తుంటేనే వారు చాలా ఎంజాయ్ చేసినట్లుగా అనిపిస్తుంది కదా..!
Please Read Disclaimer