వైకుంఠపురంకు సూపర్ స్టార్ స్పెషల్ గెస్ట్

0

అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. అందుకే బన్నీ ప్రతి సినిమాను అక్కడ విడుదల చేస్తుంటారు. అలాగే అల వైకుంఠపురం లో చిత్రాన్ని కూడా అక్కడ విడుదల చేయబోతున్నారు.

ఇటీవలే ఈ చిత్రం ప్రమోషనల్ వేడుకను మ్యూజికల్ నైట్ పేరుతో హైదరాబాద్ లో భారీగా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అతి త్వరలోనే కేరళలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ చిత్రం ప్రమోషన్ ప్రెస్ మీట్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా అంటే అక్కడ మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ను మరింత పెంచే ఉద్దేశ్యం తో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఈ ప్రెస్ మీట్ కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్లు గా సమాచారం అందుతోంది.

మెగా కుటుంబంతో మోహన్ లాల్ కు మంచి సన్నిహిత్యం ఉంది. కనుక అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ప్రెస్ మీట్ కు హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నట్లు గా సమాచారం అందుతోంది. నేడు లేదా రేపు ఈ ప్రెస్ మీట్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. మోహన్ లాల్ డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లు గా మెగా వర్గాల ద్వారా తెలుస్తోంది.

అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించగా కీలక పాత్ర లో సీనియర్ హీరోయిన్ టబు మరియు తమిళ నటుడు సముద్ర ఖని ఇంకా మురళి శర్మ ప్రముఖులు నటించారు. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించి బన్నీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.
Please Read Disclaimer