క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకున్న బన్నీ

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భవిష్యత్ ప్రాజెక్టు ల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. బన్నీ తన చివరి సినిమా ‘నాపేరు సూర్య’ తర్వాత స్క్రిప్ట్ విషయం లో మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కు ప్యాన్ ఇండియన్ టచ్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట.

బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురము లో’ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం లో బన్నీ నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి.. ఈ సినిమాను వచ్చే ఏడాది జులైలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడట.

అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుందని సమాచారం. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీతో చేసేందుకు రెడీ అవుతున్నారట. కొరటాల ప్రాజెక్టు తర్వాత మురుగదాస్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడట. ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ ఇప్పటికే లాక్ అయ్యాయని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాల కు సంబంధించిన ప్రకటనలు వస్తాయని సమాచారం. సుకుమార్.. కొరటాల శివ.. మురుగదాస్.. ఈ లిస్టు చూస్తుంటేనే స్టైలిష్ స్టార్ ఎలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చే అంశమే అని చెప్పాలి.




Please Read Disclaimer