డాడీ ప్రారంభించిన యజ్ఞంలో బన్ని తపస్సు

0

మహమ్మారీ ప్రతిదీ మార్చేసింది. ముఖ్యంగా వినోదరంగంపై అసాధారణ ప్రభావం చూపించింది. ఇప్పుడు సినిమా వీక్షణ అంటే కేవలం థియేటర్ మాత్రమే కాదు.. ఇంట్లోనే ఉండి వీక్షించేది అని ప్రూవ్ అయ్యింది. స్మార్ట్ యుగంలో డిజిటల్ యుగంలో సినిమా ఇంటికే వస్తుందని స్మార్ట్ ఫోన్ లు ట్యాబ్ లు స్మార్ట్ టీవీల్లో వీక్షణ అత్యంత సులువైనదని.. సురక్షితమైనదని.. ఖరీదు తక్కువ అని కూడా అందరికీ అర్థమైంది.

సరిగ్గా ఇవే ఎలిమెంట్స్ డిజిటల్ వీక్షణ వృద్ధికి కారణమవుతోంది. కరోనా క్రైసిస్ సమయంలో ఓటీటీలు టీవీ ఇండస్ట్రీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. స్మార్ట్ వీక్షణ అంతకంతకు పెరుగుతోంది. ఆ క్రమంలోనే పలు ఓటీటీ సంస్థలు సబ్ స్క్రైబర్లను పెంచుకునే దిశగా అడుగులు వేశాయి. అలాగే చాలా మంది నిర్మాతలు కూడా సొంత ఓటీటీ వేదికలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

టాలీవుడ్ వరకూ చూస్తే తొలిగా బాస్ అల్లు అరవింద్ ఆహా -తెలుగు ఓటీటీని ప్రారంభించి సంచలనాలకు తావిచ్చారు. ఈ వేదికను సక్సెస్ చేసేందుకు వందల కోట్లు వెచ్చించేందుకు ఆయన ముందుకు వచ్చారు. క్రైసిస్ కాలంలో వేగంగా సబ్ స్క్రైబర్లను పెంచుకునే ఎత్తుగడ వేశారు. కొంతవరకూ సక్సెసైనా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల శిష్యుల్ని .. యువ డైరెక్టర్లను పిలిచి మరీ వెబ్ కంటెంట్ డైరెక్ట్ చేసేందుకు అవకాశాలిచ్చారు. కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారు. సమంతతో రియాలిటీ షోలు ప్లాన్ చేశారు. దేవరకొండ సహా పలువురు హీరోలు ఈ వేదిక ప్రమోషన్ కి సహకరిస్తున్నారు.

అయితే ఇంతటితో ఇది ఆగడం లేదు. ఇప్పుడు నేరుగా అల్లు అరవింద్ వారసుడు అయిన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా బరిలో దిగి ఆహా బ్రాండ్ వ్యాల్యూ పెంచే పనిలో పడ్డారట. తానే స్వయంగా నిర్మాతగా మారి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం సొంతంగా ఓ బ్యానర్ ని లాంచ్ చేయనున్నారని చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ .. జీఏ2 ఉన్నా వెబ్ సిరీస్ ల కోసం మరో కొత్త బ్యానర్ ప్రారంభించనున్నాట. ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల శిష్యులు వినిపించిన కథల్ని లాక్ చేశారని ఖాళీ దొరికితే కథలు వినే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి తండ్రి గారు ప్రారంభించిన యజ్ఞంలో తాను కూడా భాగం అవుతున్నారు బన్ని. ఎవరేం చేసినా ఆహా బ్రాండ్ ని పరుగులు పెట్టించడం సక్సెస్ అందించడమే అంతిమ లక్ష్యం. అలాగే సత్యం థియేటర్ స్థానంలో ఏఏ బ్రాండ్ తో మల్టీప్టెక్స్ .. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో భారీ ఫిలిం స్టూడియోలకు బన్ని బ్రాండింగ్ చేస్తున్ సంగతి విధితమే.