మురుగదాస్ ఖాతాలో మరో టాలీవుడ్ హీరో

0

తమిళ చిత్ర పరిశ్రమలో మురుగదాస్ కు అసాధారణ ఇమేజ్ ఉంది. ఎంత కమర్షియల్ సినిమా తీసినా అందులో సమాజానికి ఉపయోగపడే సందేశం లేకుండా ఆయన సినిమా చేయరు. ఇప్పటి వరకు ఈ జాతీయ అవార్డ్ గ్రహీత చేసిన చిత్రాల లైనప్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. హిందీలోనూ మురుగదాస్ కి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడికి టాలీవుడ్ లో మాత్రం కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి తో `స్టాలిన్` చేసినా.. ప్రిన్స్ మహేష్ తో `స్పైడర్` చేసినా ఆశించిన స్థాయిలో తెలగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.

తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయానని.. తెలుగు హీరోలతో సూపర్ హిట్లు అందించలేకపోయానని ఇటీవల మురుగదాస్ ఓపెన్ గా ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో `దర్బార్` చిత్రాన్నినిర్మిస్తున్న మురుగదాస్ త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారట. చాలా కాలంగా అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం చేయాలని ఎదురుచూస్తున్నారు. గతంలో లింగుస్వామితో సినిమా చేయాలని ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ క్రమంలోనే మురుగ బన్ని లైన్ లోకి వచ్చారట.

ఇటీవలే అల్లు అర్జున్ కు మురుగదాస్ కథ వినిపించారట. స్టోరీ నచ్చడం తో అల్లు అర్జున్ వెంటనే అంగీకరించాడని తెలిసింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబధించి అఫీషియల్ న్యూస్ ని చిత్ర వర్గాలు త్వరలోనే ప్రకటించే అవకాశం వుందని ఓ ప్రచారం వేడెక్కిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ సినిమాపై దృష్టి సారించారు. అలాగే సంక్రాంతి బరిలో వస్తున్న `అల వైకుంఠపురములో` ప్రచారంలోనూ బిజీగా ఉన్నారు.
Please Read Disclaimer