‘అల వైకుంఠపురములో’ ట్రైలర్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ చిత్రం విడుదలవుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ అంచనాలను రెట్టింపు చేయడానికి తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి జరిగిన ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులు కొన్నింటిని ఈ ట్రైలర్‌లో వినిపించారు.

‘‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’’, ‘‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే’’ డైలాగులు ట్రైలర్‌లో బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు, త్రివిక్రమ్ గత చిత్రాలు మాదిరిగానే మంచి కామెడీ, అదిరిపోయే యాక్షన్ సీన్స్‌కు ఈ సినిమాలో కొదవలేదు. మొత్తంగా చూసుకుంటే మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Please Read Disclaimer