స్టైలిష్ స్టార్ విజన్ 2022 లీక్

0

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` పరాజయం బన్నీని ఎంత డిస్ట్రబ్ చేసిందో తెలిసిందే. వ్యక్తిగతంగా.. వృత్తి పరంగా తనని తాను రివ్యూ చేసుకునేందుకు స్కోప్ ఇచ్చిన పరాజయమిది. తరువాత ఏ సినిమా చేయాలని ఆలోచనతోనే ఏడాది పైగా గడిచిపోయింది. తను నమ్మిన వాళ్లు పర్ ఫెక్ట్ అని తననే కన్విన్స్ చేసేయడం .. నమ్మిన కథ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాపవ్వడం బన్నీ జీర్ణించుకోలేకపోయారు.

దీంతో మనం ఎటు వెళుతున్నాం?. ఇంతకీ ఎక్కడున్నాం.. అని పునరాలోచనలో పడటం వల్లనే ఆయన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` రిలీజ్ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్నారని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ఇంటర్వ్యూల్లోనే చెబుతోంది. ఆ పరాజయం తరువాత కొంత తేరుకున్న బన్నీ మాటల మాంత్రికుడితో `అల వైకుంఠపురములో` చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ సినిమా జనవరి 11న రిలీజ్ రెడీ అవుతోంది. ఈ సినిమాపై బన్నీ బ్యాచ్ ఫుల్ కాన్ఫిడెంట్ తో వున్నారట. ఈ సారి గట్టిగా హిట్టు కొట్టబోతున్నామని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో బన్నీ అభిమానుల్లో కొత్త ఏడాది కొత్త జోష్ ని నింపబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ సినిమా తరువాత బన్నీ వరుసగా సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. 2022 వరకు బన్నీ డేట్స్ లాక్ అయిపోయాయని తెలుస్తోంది. పరాజయం నుంచి బయటపడేంత హిట్టు కొట్టి అటుపై ఊపిరి సలపనంత షెడ్యూల్ తో నెక్ట్స్ లెవల్ ఏంటో చూపించాలని కసిగా ఉన్నాడట. కాంపిటీషన్ ఎంత ఉన్నా వారియర్ లా దూసుకెళ్లే ప్రణాళికల్లో ఉన్నాడు. `అల వైకుంఠపురములో` తరువాత సుకుమార్ సినిమా..ఆ తరువాత మురుగదాస్ సినిమా.. అటుపై వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్.. ఈ వరుసలోనే కొరటాల శివతో ఓ సినిమా.. ఇలా నాలుగు సినిమాలతో బన్నీ డైరీ ఫుల్ అయిపోయిందట. అంటే బన్నీకి కథ వినిపించాలంటేనే చాలా వెయిట్ చేయాలి. ప్రాజెక్టు పట్టాలెక్కించాలంటే రెండు మూడేళ్లు ఎదురు చూడక తప్పదు.
Please Read Disclaimer