ఆ విమర్శలకు బ్రేక్ వేసిన అల్లు అర్జున్

0

ఈమద్య కాలం లో స్టార్ హీరోల మద్య ఎంత పోటీ వాతావరణం ఉన్నా కూడా స్నేహంగానే ఉంటున్నారు. వారి అభిమానులు ఢీ అంటే ఢీ అంటూ ఉన్నా హీరోలు మాత్రం స్నేహం గా మెలుగుతున్నారు. మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. ఒకరి వేడుకలకు మరొకరు హాజరు కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి గెస్ట్ గా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రోజు రామ్ చరణ్ ఒక కార్యక్రమంలో మహేష్ బాబు కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇతర హీరోలు స్నేహాంగా ఉంటున్నారు.. ఒకరి సినిమాల గురించి మరొకరు మాట్లాడుతూ మంచి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఇతర హీరోలను పోటీ తత్వంతోనే చూస్తాడు.. ఇతర హీరోల సినిమాల గురించి స్పందించడు అంటూ ఒక విమర్శ చాలా రోజులుగా ఉంది. అల్లు అర్జున్ చివరకు రామ్ చరణ్ సినిమాలపై కూడా స్పందించలేదు అంటూ గతంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కాని ఆ వాదన పూర్తిగా అవాస్తవం అని.. తాను బాహాటంగా బహిరంగంగా స్పందించకున్నా ఏ సందర్బంలో స్పందించాలో ఆ సందర్బంగా స్పందిస్తాను అంటూ చెప్పకనే చెప్పుకొచ్చాడు.

నిన్న జరిగిన అల వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న దర్బార్.. సరిలేరు నీకెవ్వరు మరియు కళ్యాణ్ రామ్ సినిమా అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న తన సినిమాతో పాటు అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకోవడం బన్నీ మంచితనంకు నిదర్శణం అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు బెస్ట్ విశెష్ చెప్పిన బన్నీకి మహేష్ బాబు నుండి మాత్రం ఆల్ ది బెస్ట్ రాలేదు అంటూ కొందరు అంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక.. అప్పటి వరకు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మహేష్ బాబు కూడా అల్లు అర్జున్.. త్రివిక్రమ్ లకు తన విశెష్ తెలియజేయడం కన్ఫర్మ్ అంటున్నారు. హీరోలందరు స్నేహపూర్వకంగా ఉంటే అభిమానుల మద్య సోషల్ మీడియా గొడవలు చాలా వరకు తగ్గుతాయి.
Please Read Disclaimer