సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఆన్ సెట్స్ లో లైకాతో బన్నీ సినిమా

0

ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. నా పేరు సూర్య ప్లాప్ కలతను మరిపించే విజయమిది. సంక్రాంతి విన్నర్ గా రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. వరుస సక్సెస్ మీట్లతో బన్నీ ఫుల్ జోష్లోకి వెళ్లిపోయాడు. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో హాజరు కానున్నాడు అన్నది ఇప్పటివరకూ ఉన్న అప్ డేట్.

అయితే బన్నీ సైలెంట్ గా వేరొక సినిమాని ప్రారంభించేశాడన్న షాకింగ్ న్యూస్ తెలిసింది. దీని పై కోలీవుడ్ మీడియా సహా టాలీవుడ్ లో ఓ అగ్ర పత్రిక ఆసక్తిర విషయాన్ని రివీల్ చేసింది. దర్బార్ డిస్ర్టిబ్యూటర్ల వివాదంలో భాగంగా ఈ విషయం బయటకు రావడం సంచలనంగా మారింది. బన్నీ హీరోగా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒక్కటైన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుందని.. ఆ సినిమా సెట్స్ లో ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. దర్బార్ డిస్ర్టిబ్యూటర్లు మురగదాస్ కోసం ఆయన ఇంటికి వెళ్లగా…మురగదాస్ మనుషులు లైకా నిర్మిస్తోన్న బన్నీతో చేస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కు ఆయన వెళ్లినట్లు వెల్లడించారు.

దీంతో బన్నీ- లైకా సైలెంట్ గా సినిమా మొదలు పెట్టారన్న వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ కనీసం రూమర్ అయినా వినిపంచలేదు. అలాంటిది బన్నీ తో లైకా సినిమా నిర్మించడం ఏంటి? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. మరి ఇది తప్పుడు సమాచారమా? లేక నిజమా? అన్నది బన్నీ గానీ..లైకా గానీ క్లారిటీ ఇస్తే గాని తెలియదు. అయితే మురుగదాస్ వినిపించిన లైన్ ఇంతకుముందు బన్ని విన్నారు అన్న సమాచారం అయితే ఉంది.
Please Read Disclaimer