అల.. బన్నీ వారసుల ఎంట్రీకి బాగా ఖర్చు చేశారట

0

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాను సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నిన్న రాత్రి మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిత్రం తో అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు అల్లు అయాన్ మరియు అల్లు అర్హలు వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో పెద్ద స్టార్స్ అయ్యారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా లో తన ముద్దు ముద్దు మాటలతో చాలా ఫేమస్ అయ్యింది. అలాంటి వీరిద్దరు అల వైకుంఠపురంలో సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే వీరిద్దరు కూడా ఒకటి రెండు నిమిషాల నిడివి సీన్ లో మాత్రమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పారిస్ లో వీరిద్దరిపై కేవలం రెండు గంటల షూట్ ను మాత్రమే చేశారట. ఆ రెండు గంటల షూట్ కే చాలా ఖర్చు చేసినట్లుగా త్రివిక్రమ్ అన్నాడు.

అల్లు అర్జున్ పిల్లల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైం తన సినిమాలో సూపర్ స్టార్ అల్లు అయాన్ మరియు మోస్ట్ బ్రిలియంట్ స్టార్ అర్హ యాక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. వాళ్లు ఎంతో బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే పారిస్ వచ్చి మాకు కాల్షీట్లు ఇచ్చి నటించారు. ఆ ఇద్దరు రెండు గంటలు పని చేసేందుకు చాలా ఖర్చు అయ్యింది. ఆ ఖర్చును చూసి నిర్మాతలు అల్లు అరవింద్ గారు మరియు చినబాబు గారు మా వైపు పెద్ద కళ్లతో చూశారు.

అయినప్పటికి వారిద్దరు స్టార్స్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టక తప్పలేదు అంటూ త్రివిక్రమ్ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరిని నా సినిమాలో నటింపజేసినందుకు బన్నీ మరియు స్నేహా గార్లకు కృతజ్ఞతలు అన్నాడు. అయాన్ మరియు అర్హలు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇక ఈ చిత్రంలో వారి గెస్ట్ అప్పియరెన్స్ కు చాలా ఖర్చు అయినా.. అందుకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
Please Read Disclaimer