అల్లువారి అబ్బాయిలు.. కోడలమ్మలు

0

నిన్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పుట్టినరోజు. దీంతో అల్లు ఫ్యామిలీలో ఫుల్లుగా సందడి నెలకొంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడుపుతూ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు అల్లు బాబీ. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలిసి ఫోటోలు కూడా తీయించుకున్నారు.

అల్లు బాబీ ఈ ఏడాది యోగా ట్రైనర్ నీలు షా ను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో అల్లు బాబీ – నీలు షా జంట.. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి జంటతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చారు. అందరూ ఈ ఫోటోలో సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అల్లు బాబీ డార్క్ కలర్ బ్లేజర్ ధరించి సాల్ట్ పెప్పర్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక స్టైలిష్ స్టార్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అల్లువారి కోడలమ్మలు కూడా ఎంతో మోడరన్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఇక అల్లు బాబీ ఈమధ్యే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రంతో బాబీ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో గీతా ఆర్ట్స్ బాధ్యతలు చేపడతారేమో చూడాలి.
Please Read Disclaimer