ఇప్పటికే ఆలస్యం.. ఆమెకోసం ఇంకా వెయిట్ చేయలేనంటున్న వరుణ్!!

0

‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో వరుణ్ వెంటనే మరో సినిమాను చేయాలనే ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటికే వరుణ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మాణంలో ఒక చిత్రం మొదలు అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమా దాదాపు ఆరు నెలలుగా అనుకుంటున్నారు. చాలా రోజుల క్రితమే వరుణ్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా ఫొటోలు మరియు వీడియోలు కూడా వచ్చాయి.

ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమంలు కూడా పూర్తి అయ్యాయి. షూటింగ్ కూడా నవంబర్ లేదా డిసెంబర్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీని నిర్మాత అల్లు బాబీ సంప్రదించాడట. ఆమె ఓకే చెప్పిందని వరుణ్ కు జోడీగా ఆమె నటించబోతుందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు కియారా అద్వానీ వల్ల ఈ ప్రాజెక్ట్ విషయంలో గందరగోళం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా అద్వానీ చాలా బిజీ హీరోయిన్. ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేయాలి అంటే కనీసం మూడు నెలల టైం అయినా పడుతుందట. అప్పటి వరకు వెయిట్ చేస్తే వరుణ్ మూవీకి డేట్స్ ఇస్తానంటూ ఆమె హామీ ఇచ్చిందట. దాంతో దర్శక నిర్మాతలు అప్పటి వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారట. కాని వరుణ్ మాత్రం ఆమె కోసం అప్పటి వరకు ఆగాల్సిన అవసరం నాకు లేదు అంటున్నాడట.

ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరగబట్టి చాలా నెలలు అవుతుంది. వెంటనే మొదలు పెట్టాలని.. లేదంటే తాను మరో ప్రాజెక్ట్ కు కమిట్ అవుతానంటూ నిర్మాతలకు చెప్పాడట. దాంతో నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు ఆమెనే కావాలని కోరుకుంటారా లేదంటే వరుణ్ కోసం మరో హీరోయిన్ ను సెట్ చేస్తారో చూడాలి
Please Read Disclaimer