రచ్చగెలిచి ఇంట సినిమా చేస్తున్న మెగా ప్రిన్సు!

0

మెగా ఫ్యామిలీ హీరోలు చాలామందే ఉన్నా వారిలో వరుణ్ తేజ్ రూటే సెపరేటు. విభిన్నమైన కథలు ఎంచుకోవడం.. ప్రయోగాలు చేయడంతో వరుణ్ ఒక ప్రత్యేకమమైన ఇమేజ్ సాధించాడు. వరుణ్ ఇప్పటివరకూ తొమ్మిది సినిమాలు చేస్తే అవన్నీ బయట నిర్మాతలకు చేసినవే. ఈరోజే వరుణ్ తేజ్ కొత్త సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ మెంబర్ నిర్మాత కావడం విశేషం.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్(బాబీ) నిర్మాతగా మారుతున్నారు. వరుణ్ గీతా ఆర్ట్స్ ఒక సినిమా చేస్తాడని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి కానీ అది కుదరలేదు. వరుణ్ తేజ్ కొత్త సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు కానీ అల్లు బాబీ తన సొంత బ్యానర్ పై సిద్దు ముద్దా తో కలిసి నిర్మిస్తున్నారు. సహజంగా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉండే హీరోలు ఇలా సొంత కాంపౌండ్ లో సినిమా చేయడానికి ఇన్నిరోజులు తీసుకోవడం విశేషమే. అంటే ఇప్పటివరకూ బైట బ్యానర్లలో సినిమాలు చేసి తనను తాను నిరూపించుకున్న వరుణ్ ఇప్పుడు ఫ్యామిలీ ప్రొడ్యూసర్ తో పని చేస్తున్నాడు.

ఇక నిర్మాతగా అల్లు అరవింద్ సక్సెస్ రేట్ అందరికీ తెలిసిందే. అయన వారసుడిగా అల్లు బాబీ మొదటిసారి ప్రొడ్యూసర్ గా మారడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తండ్రి బాటలో నడిచి అల్లు బాబీ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.