వీడియో: అల్లు వారి మెగా పెళ్లి సందడి

0

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబి ఇటీవలే యోగా టీచర్ నీలాషాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. ఆ ఇద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటుపై ఎంతో నిరాడంబరంగా కుటుంబ సభ్యులు.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహం వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ నుంచి కీలక సభ్యులంతా అటెండయ్యారు.

తాజాగా అల్లు వారి పెళ్లి వీడియో ఒకటి అంతర్జాలంలోకి రిలీజైంది. ఈ పెళ్లి వేడుక ఎంత కన్నుల పండుగగా సాగిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీనిని అల్లు ఫ్యామిలీ ఎంతో డీసెంట్ ఎఫైర్ గా భావించిందని వీడియో చెబుతోంది. ఈ వేడుక ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలో చిరంజీవి సహా శ్రీమతి సురేఖ- మెగా బ్రదర్ నాగబాబు- అల్లు శిరీష్- బన్ని సతీమణి స్నేహారెడ్డి- నిహారిక కొణిదెల.. కళ్యాణ్ దేవ్ – శ్రీజ దంపతులు తదితరులు సందడి చేశారు.

ఈ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ మిస్సవ్వడానికి కారణం అతడు ప్రస్తుతం ఏఏ19 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పెళ్లి తర్వాత అన్న-వదినలతో కలిసి దిగిన అల్లు అర్జున్ ఫోటో ఒకటి అంతర్జాలంలో ఇటీవలే రివీలైంది. ప్రస్తుతం అల్లు వారి పెళ్లి సందడికి సంబంధించిన వీడియో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer