‘అల్లు’ బ్రదర్స్ కోరిక తీరిపోయిందిగా

0

అల్లు ఫ్యామిలీ నుండి బన్నీ శిరీష్ లకు ఓ కోరిక ఉండేది. ‘గీత గోవిందం’ తర్వాత సిద్ శ్రీరామ్ తో ఓ పాట పాడించుకోవాలనేది ఆ కోరిక. సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా “ఇంకేం ఇంకేం కావాలె” అతని కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.ఆ సాంగ్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేసింది.

ఆ సాంగ్ నుండే చిన్న సినిమాలకు కూడా సిద్ ను సంప్రదించడం జరిగింది. ఇక అల్లు శిరీష్ కూడా తన సినిమాలో సిద్ పాట ఉండాల్సిందే అంటూ ‘ABCD’ కోసం అతనితో “మెల్ల మెల్లగా” అనే పాట పాడించుకున్నాడు. శిరీష్ ఊహించినట్టే ఆ సాంగ్ పాపులర్ అయింది. సినిమాలో ఆ సాంగే హైలైట్ గా నిలిచింది. ఇక ‘గీత గోవిందం’ ఆడియో లాంచ్ కి గెస్ట్ గా ఎటెండ్ అయిన బన్నీ అప్పుడే సిద్ తో తన సినిమాలో ఓ పాట పాడించుకోవాలని ఫిక్సయ్యాడట.

‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ సిట్టింగ్స్ లో థమన్ కి సిద్ తో ఓ పాట పాడించమని ముందే ఆర్డర్ వేశాడట. ఇక సిద్ పాడితే ఎలాగూ సాంగ్ హిట్ కన్ఫర్మ్ అని భావించి థమన్ వెంటనే సిద్ శ్రీరామ్ ను సంప్రదించాడట. బన్నీ & టీమ్ ఊహించినట్టే “సామజవరగమనా” ఈ ఏడాది బెస్ట్ పాపులర్ సాంగ్ అయింది. సినిమా మీద ఎక్కడలేని హైప్ తీసుకొచ్చేసింది. ఇలా బన్నీ శిరీష్ లు సిద్ తో చెరో పాట పాడించేసుకొని కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ అందేసుకొని కోరిక తీర్చేసుకున్నాడు.
Please Read Disclaimer