అల్లు బ్రదర్స్.. ఆల్ ఈజ్ వెల్

0

ఈమధ్య సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు తనయులు ముగ్గురికి ఆస్తిపంపకాలు చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ వార్తలు రాకమునుపే అల్లు అర్జున్ కొత్త ఆఫీసు స్పేస్ తీసుకోవడం.. సొంత బ్యానర్ పై సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తర్వాత సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో అల్లు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ తర్వాతే ఆస్తిపంపకాలు అనే వార్తలు వచ్చాయి.

అల్లు ఫ్యామిలీ మొదటి నుంచి ఉమ్మడిగానే ఉండేది. ఇప్పటికీ అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు. ఈ విడిగా ఉండే ఆఫీసులు.. ఇళ్ళు అనగానే విభేదాల రూమర్లను చాలామంది నమ్మేశారు. అయితే కాసేపటి క్రితం అల్లు శిరీష్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేశాడు. “వన్ టూ..అండ్ త్రీ. నిన్న రాత్రి. #బ్రదర్స్” అంటూ ఓ సింపుల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోలో అల్లు వెంకటేష్(బాబీ).. అల్లు అర్జున్.. అల్లు శిరీష్ ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ముగ్గురూ ఒకే థీమ్ అన్నట్టుగా డార్క్ కలర్ బ్లేజర్లు ధరించడం విశేషం. ఇంగ్లిష్ లో ఒక పిక్చర్ వెయ్యి పదాలకు సమానం అనే కొటేషన్ ఉంది. అలా ఈ ఒక్క ఫోటో వెయ్యి రూమర్లకు చెంపపెట్టు.

వేరే బ్యానర్లు ఉన్నా.. ఎలా ఉన్నా ముగ్గురు అల్లు బ్రదర్స్ ఒకటేనని శిరీష్ ఆ ఫోటోతో పరోక్షంగా ఒక సూపర్ మెసేజ్ ఇచ్చాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ముగ్గురు మొనగాళ్ళు”.. “బ్రదర్స్ లవ్”.. “3 బెస్ట్ బ్రదర్స్’ అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer