అల్లు అబ్బాయి ఫోటో.. హాట్ టాపిక్ అయిందే

0

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నిన్న సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. శిరీష్ వదినమ్మ స్నేహారెడ్డి 29 వ తారీఖున తన పుట్టిన రోజు జరుపుకున్నారు. దీంతో ఇంట్లో బర్త్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీ నుంచి ఒక ఫోటో పోస్ట్ చేస్తూ శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ పెట్టాడు.

“నాకెప్పుడు ఇష్టమైనవి చేసి పెట్టే.. సరదాగా ఉండే స్నేహ వదినకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు సూపర్ గా.. శెలవులతో ఉండే ఏడాదిగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ వదినమ్మ పై అభిమానాన్ని కురిపించాడు. ఇక ఫోటోలో స్నేహను హగ్ చేసుకున్నాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు. వదిన – మరిది మధ్యలో ఉండే అందమైన అనుబంధం.. ఈ ఫ్రెండ్లీనెస్ చూసి చాలామంది మెచ్చుకున్నారు. స్నేహకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఈ ఫోటోపై కొందరు సంప్రదాయవాదులు మాత్రం విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కారణం ఏంటంటే నార్త్ ఇండియా లోనూ.. ఇక్కడ హైఫై ఫ్యామిలీస్ లోనూ తప్ప సహజంగా తెలుగు కుటుంబాలలో వదినను ఏ మరిది కూడా హగ్ చేసుకోరు. పైగా స్నేహ డ్రెస్ కొంచెం గ్లామరస్ గా ఉండడంతో సడెన్ గా చూస్తే తప్పు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇదేంటి శిరీష్.. ఇలాంటి ఫోటో పోస్ట్ చేశావని కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. కొందరు ఘాటుగానే విమర్శించారు.

ఏదేమైనా మనం చూసే దృష్టికోణాన్ని బట్టే ఉంటుంది. వదిన-మరిది అంటే తల్లి-కొడుకుతో సమానం. మరి ఆ ఫోటోను చూసి విమర్శలు చేసే సదరు కల్చర్డ్ జనాలకు ఇలా చెత్త కామెంట్లు చేయడం సంప్రదాయం కాదని.. తప్పుడు దృష్టితో ఫోటోను చూడకుండా ఉండాలని తెలియకపోవడం మాత్రం విచారకరం.
Please Read Disclaimer