శృతిమించితే చట్టపరమైన చర్యలు : అల్లు శిరీష్

0

సెలబ్రెటీల గురించి సోషల్ మీడియా లో ఈమద్య కాలంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఇష్టానుసారంగా పుకార్లు క్రియేట్ చేయడం.. ఫేస్ ఫొటోలతో జనాల దృష్టి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం ఎక్కువ అయ్యింది. స్టార్స్ కు సంబంధించిన ఏదైనా ఫేక్ వార్త క్రియేట్ చేస్తే తాను ఫేమస్ అయిపోవచ్చు అనుకునే వారు చాలా ఎక్కువ అయ్యారు. తాజాగా ఒక నెటిజన్ మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

తమ ఫ్యామిలీపై చెడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన అతడిపై అల్లు శిరీష్ ఫైర్ అయ్యాడు. ఇలాంటివి పోస్ట్ లతో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించబోమన్నాడు. మాపై ప్రచారం శృతి మించితే చట్టపరమైన చర్యలకు సిద్దమవుతామంటూ ఘాటుగా ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వెంటనే అతడు ఆ ట్వీట్ ను చేయడంతో పాటు ట్విట్టర్ నుండే తప్పుకున్నాడు. సోషల్ మీడియాలో ఈమద్య సెలబ్రెటీల గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్న వారు అల్లు శిరీష్ ఇచ్చిన వార్నింగ్ గుర్తు పెట్టుకోవాలి.

ఇక నేడు అల వైకుంఠపురంలో జరుగబోతున్న అల వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో హాజరు కాబోతున్నట్లుగా కూడా శిరీష్ మరో ట్వీట్ ద్వారా తెలియజేశాడు. సరైనోడు తర్వాత అంటే నాలుగు సంవత్సరాల తర్వాత అన్నయ్య బన్నీ సినిమా వేడుకకు హాజరు కాబోతున్నట్లుగా ఈ సందర్బంగా శిరీష్ చెప్పుకొచ్చాడు. అతి త్వరలోనే శిరీష్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త దర్శకుడితో కథ చర్చలు చివరి దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer