2020లో ముసళ్ల పండగ అంటూ షాకిచ్చాడు

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కెరీర్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్నను మించిన తమ్ముడిగా నిరూపించుకోవాలన్న కసితో బరిలో దిగిన శిరీష్ ఎందుకని వెనకబడ్డాడు? పట్టుదల తగ్గిందా? అంటూ ఫ్యాన్స్ లో ఘాటైన చర్చ సాగింది.

అయితే కొంతకాలంగా శిరీష్ కి ఆశించిన విజయాలు దక్కకపోవడమే ఇందుకు కారణం. శ్రీరస్తు శుభమస్తు మినహా ఇతర సినిమాలేవీ ఆశించినంత మైలేజ్ ని ఇవ్వలేదు. దాంతో కొంత నిరాశ తప్పలేదు. ఏడాది కాలంగా స్థబ్ధత కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఫిలింవర్గాలు సహా మీడియాలోనూ శిరీష్ నటించే తదుపరి చిత్రం ఏదీ అంటూ ఆరాలు వేడెక్కించాయి. అయితే ఫలానా సినిమా చేస్తున్నాను అని అధికారికంగా చెప్పకపోవడం వల్లనే ఈ కన్ఫ్యూజన్.

తాజాగా శిరీష్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. 2020లో రెండు రిలీజ్ లు ఉంటాయి! అంటూ సైలెన్స్ ని బ్రేక్ చేశాడు. ఆ మేరకు ట్విట్టర్ లో అతడు ఇచ్చిన ప్రకటన సర్ ప్రైజ్ చేస్తోంది. అసలింతకీ ఆ సినిమాల సమాచారం ఏమిటి అన్నది అతడు చెప్పకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేయడం హీటెక్కిస్తోంది. మరోవైపు శిరీష్ సొంతంగా ఓ ఓటీటీ వేదికను సిద్ధం చేసుకుని అందులో నటించబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. శిరీష్ కి సూటయ్యే మంచి కథలు వర్కవుటైతే సొంత ఓటీటీ వేదికకు పెద్ద ఆసరా అవుతాడన్న చర్చా సాగుతోంది. కొత్త తరానికి అవకాశాలిస్తూనే తాను కూడా నటుడిగా మరింత షైన్ అయ్యే వేదిక ఇది.. అందుకే బాస్ అరవింద్ ఇప్పటికే సీరియస్ గా దీనిపై వర్కవుట్ చేస్తున్నారు అంటూ విశ్లేషిస్తున్నారు. భవిష్యత్ అంతా మొబైల్ సినిమానే కాబట్టి అక్కడా ఠఫ్ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. మరి వెబ్ సిరీస్ లు ఓవైపు ఉన్నా.. మెయిన్ స్ట్రీమ్ లో వరుస సినిమాలతోనూ అలరించే ప్లాన్ లో ఉన్న శిరీష్ కెరీర్ పరంగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు అన్నది చూడాలి.
Please Read Disclaimer