40ఏళ్ల గ్రీకువీరుడు మెగా హీరో స్ఫూర్తి

0

40 వయసులోనూ గ్రీకువీరుడిలా ఫిజిక్ మెయింటెయిన్ చేయడం అంటే ఆషామాషీనా? వయసు పెరిగే కొద్దీ జిమ్ముకి శరీరం సహకరించేది తక్కువే. ఒక్కోసారి తేడాలొస్తే పూసలు కదిలిపోతాయి. వెన్ను నొప్పి లాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకసారి డిస్కు కదిలాక .. మళ్లీ జిమ్ము చేయాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇలాంటి సమస్యలెన్నిటినో ఎదుర్కొని తిరిగి స్టార్ హీరో హృతిక్ రోషన్ నిరంతరం జిమ్ముల్లో శ్రమించి పాత షేప్ లు తీసుకొచ్చారు. శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును తీసివేసి గ్రీకు యోధుడిలా మారాడు.

అయితే ఆయన ఇదంతా ఎందుకోసం చేశారు? అంటే వృత్తి నిబద్ధతతోనే ఇదంతా. ఇటీవలే రిలీజైన `వార్` చిత్రంలో హృతిక్ లుక్ చూసిన వారంతా మిస్టర్ మాచో మ్యాన్ అంటూ పొగిడేశారు. హృతిక్ తన కోస్టార్ అయిన యంగ్ టైగర్ ష్రాఫ్ తో పోటీపడుతూ బాడీని మెయింటెయిన్ చేశాడు. డ్యాన్సులు.. ఫైట్స్ ప్రతిదాంట్లో అతడిలోని గ్రేస్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే దాని కోసం అతడు ఓ వైపు వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నా.. వెన్నులో కొన్ని డిస్కులు కదిలిపోయినా నిరంతరం సుశిక్షితులైన కోచ్ ల సమక్షంలో జిమ్ చేశాడు. ఆ వీడియోని తాజాగా రివీల్ చేశారు హృతిక్.

ఈ వీడియో చూడగానే మెగా హీరో అల్లు శిరీష్ ఎంతో స్ఫూర్తి పొందానని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఎవరైనా సరే హృతిక్ ని చూసి నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి బాడీని మెయింటెయిన్ చేయడం అందరికీ చాలా కష్టం. అయితే మెగా హీరోల్లోనే రామ్ చరణ్- అల్లు అర్జున్- సాయిధరమ్ పెర్ఫెక్ట్ జిమ్ బాడీతో ఆకట్టుకుంటున్నారు. శిరీష్ అన్నగారు బన్ని పెర్ఫెక్ట్ ఫిట్ పర్సనాలిటీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే శిరీష్ స్ఫూర్తి తీసుకోవాలనుకుంటే హృతిక్ నే చూడాలా? అన్నగారిని ఫాలో అయితే సరిపోతుంది కదా! అని సెటైర్ వేస్తున్నారంతా. హృతిక్ ని చూసి కేవలం శిరీష్ మాత్రమే కాదు.. మన హీరోలంతా నేర్చుకోవాల్సింది చాలానే ఉందనేది ఫ్యాన్స్ మాట.