అల్లు హీరో నెక్స్ట్ ఏంటి?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు అరవింద్ తనయుడిగా గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఏదో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా చేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని ఇంకో సినిమా చేసే అల్లు శిరీష్ ప్రస్తుతం లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు. అవును ‘Abcd’రిలీజయి చాలా నెలలు గడుస్తున్నా ఇంత వరకూ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. ఆ మధ్య ప్రమోషన్స్ లో డెబ్యూ డైరెక్టర్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాని త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నాడు. అంతా కుదిరితే వారంలోనే ఆ సినిమా డీటైల్స్ బయటికోస్తాయని చెప్పాడు కూడా.

కానీ ఇంత వరకూ శిరీష్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ కాదు కదా డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు. నిజానికి ‘ABCD’సినిమాపై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు అల్లు హీరో. ఏరి కోరి తెచ్చుకున్న ఆ రీమేక్ శిరీష్ ఆశలన్నీ నిరాశలు చేసింది. అందుకే ఇప్పుడు ఈ యంగ్ హీరో టైం తీసుకొని పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహా మరో హిట్ లేకపోవడంతో ఎలాగైనా మళ్ళీ ఓ హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు.

అందుకే నెక్స్ట్ సినిమా కథా చర్చలతోనే ఎక్కువ టైం గడుపుతున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను తన సొంత బ్యానర్ లోనే చేసే ఆలోచనలో ఉన్నాడు శిరీష్. మరి స్టైలిష్ స్టార్ తమ్ముడి సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer