శిరీష్ కోసం అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్

0

టాలీవుడ్ లో చాలామంది పెద్దలకు ఉండే సమస్యే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కూడా ఉంది. ఒకవైపు అరవింద్ గారి సక్సెస్ రేట్ కు ఏమాత్రం ఢోకా లేదు.. మరోవైపు రెండవ కుమారుడు అల్లు అర్జున్ స్టార్ గా అగ్రపథాన దూసుకుపోతున్నాడు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ చిన్న కుమారుడు శిరీష్ యాక్టింగ్ కెరీర్ ను నిలబెట్టడం మాత్రం అరవింద్ గారికి కష్టంగానే ఉందట.

ఇప్పటివరకూ అరడజను సినిమాలు చేసినా శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త డీసెంట్ సక్సెస్ నమోదు చేసిన చిత్రం. మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దీంతో శిరీష్ తో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేయకుండా సేఫ్ గా ఏదైనా రీమేక్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈమధ్యే ‘రాక్షసుడు’ తో హిట్ సాధించిన దర్శకుడు రమేష్ వర్మకు అల్లు అరవింద్ ఓ ఆఫర్ ఇచ్చారట. శిరీష్ కు సూట్ అయ్యే ఏదైనా రీమేక్ ఉంటే చూడమని చెప్పారట. ఏదైనా సేఫ్ రీమేక్ ఉంటే ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అని అరవింద్ గారు హామీ ఇచ్చారట.

ఒక్క రమేష్ వర్మకే కాకుండా చిన్న సినిమాతో హిట్స్ సాధిస్తున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ ను శిరీష్ తో ఒక సినిమా చేయమని కోరడం జరిగిందట. మరి రమేష్ వర్మ .. బెక్కం వేణుగోపాల్ – శిరీష్ కాంబోలో ఓ సినిమా సెట్ చేస్తారా లేదా ఇద్దరితో విడిగా శిరీష్ కోసం రెండు ప్రాజెక్టులు సెట్ చేస్తారా అనేది వేచి చూడాలి.




Please Read Disclaimer