ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా బెల్లంకొండా?

0

టాలీవుడ్ లో సెంటిమెంట్లకు కొదవేముంటుంది చెప్పండి? విజయాల శాతం తక్కువ ఉన్న పరిశ్రమ కాబట్టి సెంటిమెంట్ల పై ఆధారపడడం నేరమూ కదూ ఘోరమూ కాదు. ఎక్కువమందికి సినిమా టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు మూడు అక్షరాల టైటిల్స్ వైపు మొగ్గు చూపితే మరొకరు తమ టైటిల్స్ లో క్రూర జంతువులు ఉండాలంటారు. ఇక కొంతమందేమో సినిమాలకు క్యాస్ట్ తోకలు తగిలిస్తూ సెంటిమెంట్ ఆయింట్ మెంట్ పూస్తున్నారు. ఇదిలా ఉంటే యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రానికి ‘అల్లుడు అదుర్స్’ అంటూ ఒక క్యాచీ టైటిల్ ఖరారు చేశారు.

ఇందులో అల్లుడు పదం సెంటిమెంట్ గానే పెట్టారని టాక్ వినిపిస్తోంది. తెలుగులో ‘అల్లుడు’ టైటిల్ తో వచ్చిన సినిమాలు దాదాపుగా హిట్లే. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా కూడా ‘అల్లుడు శ్రీను’ మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ బాబు కు మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ ఓ సూపర్ హిట్ సినిమా. దీంతో ఆ అల్లుడు.. ఈ అదుర్స్ ను కలిపి ‘అల్లుడు అదుర్స్’ అంటూ సెంటిమెంట్ ను రంగరించారని టాక్ వినిపిస్తోంది.

‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అన్ని హంగులు ఉన్నాయి. నభ నటేష్..అను ఇమ్మాన్యుయేల్ లాంటి బ్యూటీలు.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సోనూ సూద్.. ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లంకొండ బాబు రేంజ్ కి తగ్గట్టే ఉంది. వీటికి టైటిల్ సెంటిమెంట్ తోడై సినిమా హిట్ గా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-