మగధీర రికార్డు ను బ్రేక్ చేస్తున్న భాయ్!

0

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడి గా ప్రభుదేవా దర్శకత్వం లో దబాంగ్ -3 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి రెండు భాగాలు దబాంగ్… దబాంగ్-2 చక్కని విజయాలు సాధించిన నేపథ్యంలో పార్ట్ -3 రెట్టింపు అంచనాలతో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ భారీ చిత్రంలో ముకుపుడకల సుందరి సోనాక్షి సిన్హా సల్మాన్ తో రొమాన్స్ చేస్తోంది. దబాంగ్ సిరీస్ కే సోనాక్షి లక్కీ ఛామ్ గా గుర్తింపు దక్కించుకుంది. అందుకే ఆ సిరీస్ తొలి నుంచి సోనాక్షినే కథానాయికగా కొనసాగిస్తున్నారు. దబాంగ్ 3కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సినిమా కు మరింత హైప్ ను తీసుకొస్తుంది.

సల్మాన్ భాయ్ కెరీర్ లోనే ది బెస్ట్ క్లైమాక్స్ ను దబాంగ్ 3లో అభిమానులు చూడబోతున్నారట. చుల్ బుల్ పాండ్ (సల్మాన్) విలన్ బల్లిసింగ్( సుదీప్) మధ్య క్లైమాక్స్ భారీ యాక్షన్ తో గగుర్పొడిచేలా ఉంటుందట. సల్మాన్- సుదీప్ ల మధ్య యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ లో భాయ్ ఒక్కడే 500 మందితో తలపడుతున్నాడుట. అంతమందిని మట్టి కరిపించి 100 కార్లను విధ్వంశం చేసే లెవల్లో భాయ్ ని ఎలివేట్ చేస్తున్నాడుట ప్రభుదేవా. తెరపై మునుపెన్నుడు చూడని సరికొత్త భాయ్ కనిపిస్తాడని వైరల్ గానే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సహా అన్నిచోట్లా ఈ సంగతి చర్చాంశనీయాంశమైంది. సల్మాన్ అభిమానులు నెవ్వర్ బిఫోర్ అంటూ ఈ ఫైట్ కి విజిల్స్ వేయడం ఖాయమని చెబుతున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ లోగానే టీమ్ ప్రచారంతో హీటెక్కించేస్తోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్లు అనగానే ధూమ్ సిరీస్ సహా.. పలు ఫ్రాంఛైజీ చిత్రాల్లో భారీ ఛేజింగ్ సీన్లు.. మాస్ రెబల్ యాక్షన్ చూశాం. మెజారిటీ పార్ట్ ఈ తరహాలో ఏ దర్శకుడు సాహసం చేయలేదు కానీ ప్రభుదేవా ఏకంగా 500 మందితో ఢీకొట్టించే సాహసం చేస్తున్నాడు. మరి ఆ క్లైమాక్స్ తో ఎంత వరకూ మెప్పించగలుగాతాడో చూడాలి. అయితే ఇక్కడో విషయం గుర్తించాలి. టాలీవుడ్ లో ఇలాంటి అరుదైన ఫీట్ ను గతంలో రామ్ చరణ్ చేసాడు. మగధీర సినిమాలో ఒకేసారి వంద మందిపై వారియర్ గా విరుచుకుపడతాడు. అందరినీ కత్తికో కండగా నరికేస్తాడు. ఆ సీన్ సినిమా కే హైలైట్ గా నిలిచింది. క్రియేటివిటీ పరంగా రాజమౌళి ఎంతో లాజికల్ గా చూపించేందుకు వంతెనపై ఫైట్ చేయించారు. తాజాగా భాయ్ 500 మందిని మట్టి కరిపిస్తున్నాడు కాబట్టి.. ఇందులో లాజిక్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇకపోతే తన ఫ్రెండు చెర్రీ పేరిట ఉన్న రికార్డును భాయ్ బద్ధలు కొట్టేస్తుండడం ఇంట్రెస్టింగ్.




Please Read Disclaimer