‘పవర్ స్టార్’ సినిమా అనౌన్స్ చేసిన RGV…!

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వర్మ పుట్టిన తర్వాతే కాంట్రవర్సీ పుట్టింది అంటారు. చరిత్రలో నిలిచిపోయిన సినిమా తీసాడని మెచ్చుకున్న నోర్లు కూడా చెత్త సినిమా తీసాడురా అని తిట్టుకునేలా చేస్తాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడెన్ సర్ప్రైజ్ లా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ట్రైలర్ అంటూ రిలీజయ్యే దాకా పబ్లిసిటీ చేసేసి.. వెంటనే నెక్స్ట్ సినిమాని రిలీజ్ కి సిద్ధంగా చేస్తాడు. ఇలా జెట్ స్పీడ్ తో సినిమాలు తీసే వర్మ ఇటీవల వరుసగా తన సినిమాలకి సంభందించిన అప్డేట్స్ ఇస్తున్నాడు.

ఇప్పటికే ‘క్లైమాక్స్’ సినిమాని ‘ఆర్జీవీ వరల్డ్ – శ్రేయాస్ ఈటీ’లో రిలీజ్ చేసిన వర్మ నిన్న ‘నగ్నం’ సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలారు. వీటితో పాటు ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’ సినిమాలను కూడా ప్రకటించారు రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలో లేటెస్టుగా మరో కాంట్రవర్సీ టైటిల్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. వర్మ ట్విట్టర్ వేదికగా ‘పవర్ స్టార్’ అనే సినిమా చేయబోతున్నానంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు.

కాగా రామ్ గోపాల్ వర్మ సినిమా కంటే ముందే టైటిల్స్ తోనే ఆయా సినిమాలపై ప్రేక్షకులు చర్చించుకునేలా చేసి హైప్ క్రియేట్ చేస్తారు. నిజానికి ఈ టెక్నిక్ రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరకీ తెలియదని చెప్పవచ్చు. సినిమాలో విషయం ఉందో లేదో అనే విషయం పక్కనపెడితే టైటిల్ తోనే సినిమాకి బజ్ తీసుకొస్తాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ తీసి కొంతమందిని టార్గెట్ చేసిన వర్మ ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సెటైరికల్ మూవీ చేసాడు. ఈ సినిమాలో జగన్ చంద్రబాబు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తులతో యాక్ట్ చేపించి సంచలనాలు సృష్టించారు.

ఇప్పుడు తాజాగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమా అనౌన్స్ చేస్తూ.. ”బ్రేకింగ్ న్యూస్: ‘ఆర్జీవీ వరల్డ్’ లో నా తదుపరి చిత్రం ‘పవర్ స్టార్’.. ఈ సినిమాలో PK MS NB TS ఒక రష్యన్ మహిళ – నలుగురు పిల్లలు – 8 గేదెలు మరియు RGV నటించనున్నారు. ఆర్జీవీ ‘పవర్ స్టార్’లోని ఈ పాత్రలు ఎవరో అర్థం చేసుకున్నప్పటికీ బహుమతులు ఇవ్వబడవు” అని ట్వీట్ చేసారు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘పవర్ స్టార్’ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని పిలుస్తుంటారు.. సో ఈ సినిమా పవన్ పై సెటైరికల్ గా ఉండబోతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక వర్మ ట్వీట్ ని డీకోడ్ చేస్తూ ”PK – పవన్ కళ్యాణ్.. MS – మెగాస్టార్.. NB – నాగబాబు.. TS – త్రివిక్రమ్ శ్రీనివాస్.. RGV – రామ్ గోపాల్ వర్మ” అని సమాధానం చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నా లెజ్ నోవా రష్యన్ మోడల్ అని.. ఇక పవన్ కు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారని.. ఇది కచ్చితంగా పవన్ ని టార్గెట్ చేస్తూ తీసిందే అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను పోలిన వ్యక్తితో ఉన్న ఒక సన్నివేశాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వర్మ. ”నా కొత్త చిత్రం POWER STAR సినిమాలో స్టార్ ఇతనే… అతను నా ఆఫీస్ కి వచ్చినప్పుడు ఈ షాట్ తీయబడింది.. మరే వ్యక్తితోనైనా పోలిక యాదృచ్చికంగా మరియు ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఉండొచ్చు” అని ట్వీట్ చేసారు. దీనిపై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి వర్మ తన నెక్స్ట్ ట్వీట్ లో దీనిపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer