స్టేజ్ 3 అంటున్న భామ అమైరా దస్తూర్!

0

బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ పేరు తెలిసే ఉంటుంది. రాజ్ తరుణ్ ‘రాజుగాడు’.. సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ లో హీరోయిన్ గా నటించింది. అవి చూసినవారికి అమైరా తెలిసే ఉంటుంది. ఇక హిందీ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ జెనరేషన్ భామల తరహాలో సోషల్ మీడియాను షేక్ చేయడంలో దిట్ట. నెటిజన్ల కోసం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు చాలా పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్యాప్షన్ లో క్రక్స్ ను క్లుప్తంగా చెప్పుకుంటే ‘స్టేజ్ 3 ఒక మంచి ఆలోచన. మనం వివాహాలకు.. పండగలు.. ఇతర వేడుకల్లో దుస్తులకు లెక్క లేనంత ఖర్చుపెడతాం. అయితే ఒక్క సందర్భంలో ఆ బట్టలు ధరించిన తర్వాత రెండో సారి వాటిని వేసుకుంటామో లేదో తెలియదు. అందుకే ఇలాంటి ఖరీదైన దుస్తులను స్టేజ్ 3 ఉపయోగించి మనం రెంట్ కు తీసుకోవచ్చు. మనదగ్గర ఉండేవాటిని ఇతరులకు అద్దెకు ఇవ్వవచ్చు. స్టేజ్ 3(Stage3) లో మీరు ఇలా ట్రై చెయ్యొచ్చు.’ కాన్సెప్ట్ అర్థం అయిందిగా.. స్టేజ్ 3 కి ఈ పాప ప్రమోషన్ చేస్తోంది. మీకెవరికైనా ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే కింద ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసే పనే లేకుండా విచ్చలవిడిగా దూకుడు మహేష్ లా రెచ్చిపోండి.

సరే ఈ పాప కాన్సెప్ట్ గురించి చర్చించుకున్నాం. ఇక డ్రెస్ విషయానికి వస్తే క్రీమ్ కలర్ ఛోళి.. లెహెంగా ధరించింది. డ్రెస్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యే అభరణాలు ధరించి ఒక యువరాణి తరహాలో నిలుచుంది. గ్లామర్ ట్రీట్ కూడా ఫుల్లుగా ఉంది కాబట్టి ఫాలోయర్లకు ఈ ఫోటో నచ్చింది. అందుకే మంచి కామెంట్లు పెట్టారు. ‘కిల్లర్ ట్రీట్’.. ‘బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ’ అంటూ కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే అమైరా ప్రస్తుతం తమిళంలో ‘ఊడి ఊడి ఉళైకాణమ్’.. ‘కాదలై తేడి నిత్యా నందా’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer