అమలా పాల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

0

అమలా పాల్ కొత్త సినిమా ‘ఆడై/ఆమె’ టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అందులో ఆమె అర్ధనగ్నంగా ఉన్న దృశ్యాలు జనాలకు పెద్ద షాకే ఇచ్చాయి. వీటిపై ప్రేక్షకులు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు అమలా బోల్డ్ నెస్ ను – కాన్సెప్ట్ ను మెచ్చుకున్నారు. కొందరేమో అమలా బరితెగించిందన్నారు. పబ్లిసిటీ కోసం ఇలా చేసిందన్నారు. అమలకు వ్యతిరేకంగా తమిళనాట నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ చిత్రానికి ఫైనాన్స్ సమస్యలు తలెత్తి తొలి రోజు విడుదల సజావుగా జరగలేదు. ఇవన్నీ దాటుకుని ఎలాగోలా సినిమాను తొలి రోజు రాత్రి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇంత హడావుడి జరిగాక అసలీ చిత్రానికి టాక్ ఎలా ఉంటుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

కానీ ‘ఆడై/ఆమె’ అమలా కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అని చూసిన వాళ్లందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇండియాలో ఏ హీరోయిన్ చేయని బోల్డ్ యాక్ట్ ఈ చిత్రంలో చేసింది అమలా. సినిమాలో ద్వితీయార్ధం అంతా ఆమె నగ్నంగా ఉన్నట్లుగా చూపించడం విశేషం. నిజంగా అమలా నగ్నంగా ఉండి ఈ సన్నివేశాలు చేసిందో లేదో తెలియదు కానీ.. సినిమాలో మాత్రం ఆ ఫీల్ తీసుకురాగలిగింది. ప్రేక్షకులకు ఆ భ్రమ కల్పించేలా నటించడానికి కూడా గట్స్ ఉండాలి. జనాలు తనను నగ్నంగా ఊహించుకుంటారంటే ఏ హీరోయిన్ కైనా ఏదోలా ఉంటుంది. కానీ పాత్ర కోసం అమలా పెద్ద సాహసమే చేసింది. ఇందుకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా చూశాక ఆమె ఏదో కుర్రాళ్లను సినిమా వైపు ఆకర్షించడానికి ఇలా చేసింది అనిపించదు. కథకు అవసరమయ్యే అలా నటించిందని ఎవ్వరైనా ఒప్పుకుంటాడు. ద్వితీయార్ధంలో థ్రిల్ – సోషల్ మెసేజ్ జనాలకు బాగా కనెక్టయ్యే అవకాశాలున్నాయి. సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. మంచి విజయం సాధించేలా కూడా కనిపిస్తోంది.
Please Read Disclaimer