‘ఆమె’ కోసం అమలాపాల్ ఆ పని చేసిందట!

0

సినిమాలో పాత్ర కోసం ఏమైనా చేస్తామనే నటులు చాలామందే కనిపిస్తారు. కొందరు మాత్రం తాము చెప్పినట్లే.. తమ పాత్ర కోసం తమకున్న ఇమేజ్ ను పణంగా పెట్టేందుకు వెనుకాడరు. అలాంటి ఆర్టిస్టులు ఇవాల్టి కాలంలో చాలా తక్కువనే చెప్పాలి. అయితే.. తాను చేసిన సినిమా కోసం ఆర్థికంగా సైతం నష్టపోయేందుకు ఎవరైనా ముందుకొస్తారా? అందునా పేరున్న నటీనటులంటే.. చాలా తక్కువమంది పేర్లే తెర మీద వినిపిస్తాయి. తాజాగా అమలాపాల్ అలాంటి పనే చేశారన్న విషయం బయటకు వచ్చింది.

ఆమె చిత్రం కోసం అమలాపాల్ తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. కథలో భాగంగా పాత్ర కోసం నగ్నంగా నటించిన అమలాపాల్.. ఈ చిత్రం విడుదల కోసం తన రెమ్యునరేషన్ వదులుకోవటమే కాదు.. ఏకంగా ఎదురు డబ్బులు ఇచ్చిన కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రొడ్యూసర్ (తమిళ) మహా ముదురుకేసుగా చెబుతున్నారు.

సాధారణంగా ఒక సినిమాకు భారీ ఇమేజ్ వచ్చేసి.. దాని హక్కులు కొన్నవారంతా విడుదలకు వారాల ముందే తామివ్వాల్సిన డబ్బుల్ని ఇచ్చేసిన తర్వాత.. అంతకంటే హ్యాపీ ఏముంటుంది?

ఆమెలో అమలాపాల్ కారణంగా సినిమాకు భారీ క్రేజ్ రావటమే కాదు.. విడుదలకు ముందే ఈ సినిమాకు లభించిన ప్రచారం అంతా ఇంతా కాదు. అమలాపాల్ కాకుండా మరే నటి నటించినా ఇంత క్రేజ్ వచ్చేది కాదు. ఇంత కష్టపడిన ఈ చిత్రం.. విడుదల సమయానికి నిర్మాత చేతులెత్తేసి.. ఫైనాన్షియర్ల దగ్గర చేతులు ఎత్తేయటంతో.. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని వదులుకోవటమే కాదు..తాను ఎదురు డబ్బులు పెట్టి సినిమా విడుదల కోసం కష్టపడిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

తాను చేసిన సినిమా కోసం రిస్క్ తీసుకునే నటులు చాలామందే కనిపిస్తారు. కానీ.. డబ్బులు పెట్టాలంటే మాత్రం ఆలోచిస్తారు. తొందరపడరు. కానీ.. అమలాపాల్ మాత్రం అందుకు భిన్నంగా ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బులు చెల్లించక సినిమా విడుదల ఆగిపోతుండటంతో.. తానే కొంత డబ్బును ఎదురుపెట్టి మరీ సినిమా విడుదలకు సహకరించిన వైనం తెలిస్తే..తాను ఇష్టపడిన సినిమా కోసం అమలాపాల్ తీసుకున్న రిస్క్ కు ఫిదా కావాల్సిందే. ఇవాల్టి రోజున ఇంతటి రిస్క్ తీసుకునే నటులు ఎంతమంది ఉంటారు చెప్పండి?
Please Read Disclaimer