ఒంటరి దీవుల్లో తుంటరి పిల్ల ఏం చేసిందో!

0

గత కొంతకాలంగా అమలాపాల్ వ్యవహార శైలి యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాల జోలికి వెళ్లకుండా ఈ బ్యూటీ ఎంతో పీస్ ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఓవైపు విహార యాత్రలు.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవలే `ఆమె` చిత్రంలో నగ్నంగా నటించి సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. ఆ సినిమా తమిళనాట ఘనవిజయం సాధించడమే కాకుండా… తెలుగులోనూ చక్కని ఆదరణ దక్కించుకుంది. ఈ ఫలితం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందట.

ఆ క్రమంలోనే అమలా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ గాడ్స్ వోన్ కంట్రీ కేరళలో పర్యటించడమే గాక.. విదేశాల్లోనూ అందమైన ప్రకృతిని ఆస్వాధించేందుకు విమానయానం చేస్తోంది. అలా ఇటీవలే ఇండోనేషియాలోని బాలి దీవులకు వెళ్లింది. బాలి అంటే విహారయాత్రలకు ఫేమస్. నిరంతరం యాత్రికుల సందర్శనతో కిటకిటలాడుతుంటుంది. అయితే అక్కడ ఒంటరి దీవుల్లో ఇదిగో అమలా ఇలా సేద తీరుతోంది.

బాలి లోని ఓ ఓపెన్ టాప్ స్పాలో సేదదీరుతున్న పోటోలు ప్రస్తుతం యువతరంలో వైరల్ గా మారాయి. ఎర్రని గులాబి పూల రెక్కలతో పాటు అక్కడ అడవి పూలతో అలంకరించిన స్నానాల తొట్టెలో అలా చిద్విలాసంగా కనిపిస్తున్న అమలా ఎంతో రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. బాలిలోని పచ్చని అడవులు.. ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాధిస్తోంది. అక్కడ సముద్రపు జలాల్లోనూ స్నానాదులాచరించిందని ఆ ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది. కేరళ కొబ్బరి చెట్ల మధ్య పడవ ప్రయాణం చేసినా.. ఒంటరి దీవుల్లో షికార్లు చేసినా అదంతా ప్రశాంతత కోసమే. అమలా కోరుకున్న జీవితాన్ని ఆస్వాధిస్తోందన్నమాట!!
Please Read Disclaimer