వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ మ్యాగజైన్ ఫోటో!

0

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తమిళ అనువాద సినిమా ‘ప్రేమఖైది’తో అడుగుపెట్టిన అమలాపాల్.. తర్వాత ఆర్జీవీ ‘బెజవాడ’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అమలాపాల్ ఇప్పటి వరకు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. అయితే అమ్మడు ఎక్కువగా తమిళంలో చేస్తుంది. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే కానీ తన నటనతో అందాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మెగా హీరో రామ్ చరణ్ తో ‘నాయక్’ సినిమా.. అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో” సినిమాలో నటించి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ స్టార్ హీరోలతో నటించినా ఇండస్ట్రీలో మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. తెలుగు దర్శక నిర్మాతలు కూడా అమ్మడి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కెరీర్ అంతా ముగిసిందని అనుకుంటున్న టైంలో తమిళ మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టి బిజీ అవుతోంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. మనస్పర్థల కారణంగా వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు.

ఆ తర్వాత గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విఐపి2 ఆమె సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉండగా తాజాగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే దృష్టి పెడుతున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హిందీలో మహేష్ భట్ జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో అమలాపాల్ నటిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ‘షి ఇండియా’ అనే మ్యాగజైన్ కవర్ పేజీ పోస్ట్ చేసింది. ఆ మ్యాగజైన్ ఓ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కి సంబంధించినది. అయితే ఆ మ్యాగజైన్ ప్రారంభించి నేటితో ఒక సంవత్సరం పూర్తి కావడంతో అమలాపాల్ ఈ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అమ్మడి మ్యాగజైన్ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతోంది.
Please Read Disclaimer