న్యూడ్ సీన్ కు సపోర్ట్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్!

0

అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ ‘ఆమె’ శనివారం నాడు విడుదల అవుతోంది. దీంతో అమలా తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్ళి గురించి అడిగితే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే అని… కాకపోతే కొంత కాలంగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ అతను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పుకొచ్చింది.

అమల 2017 లో తన భర్త తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ నుండి విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో అమల లవ్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే అమల తాజాగా మరో ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ గురించి మరికొన్ని విషయాలు వెల్లడించింది. మనకోసం ఎవరైనా త్యాగం చేసేవారు ఉన్నారు అంటే అది అమ్మే. అయితే అమ్మ కాకుండా ఇంకెవరైనా అలా చేస్తామని నమ్మకం కలిగించేవారు అరుదుగా ఉంటారని చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ తనకు అదే నమ్మకం కలిగించాడట. అమల కోసం.. అమల కెరీర్ కోసం అతను తన కెరీర్ ను వదిలిపెట్టి మరో అల్టర్నేట్ జాబ్ చూసుకున్నాడట. తనతోనే ఉంటాడని.. తనను బాగా చూసుకుంటాడని చెప్పింది.

మరి ‘ఆమె’ లో నగ్నంగా నటించే సన్నివేశం గురించి బాయ్ ఫ్రెండ్ అభ్యంతరం వ్యక్తం చేయలేదా అని అడిగితే.. తనకు బాయ్ ఫ్రెండ్ ఈ విషయంలో పూర్తి మద్దతు ఇచ్చాడని ఫిట్నెస్ పై ఫోకస్ చేయమని ప్రోత్సహించాడు అని చెప్పింది. అంతా బాగుంది కానీ ఇంత అర్థం చేసుకునే బాయ్ ఫ్రెండ్ ఎవరని మాత్రం వెల్లడించలేదు. అమల వాలకం చూస్తుంటే అతన్ని త్వరలోనే ఈ ప్రపంచానికి పరిచయం చేసేలా ఉంది.
Please Read Disclaimer