ఫ్యాన్స్ కి అమలాపాల్ షాక్ లేంటో

0

అమలాపాల్ నటించిన `ఆమె` (ఆడై) ఇటీవలే తెలుగు-తమిళ్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా తమిళనాడులో తంబీలకు మాత్రం బాగా నచ్చిందట. ముఖ్యంగా అమలాపాల్ బోల్డ్ యాక్టింగ్ రుంబ నచ్చేసిందంటూ తంబీలు కితాబిచ్చేస్తున్నారు. అమలాపాల్ బోల్డ్ పెర్ఫామెన్స్ తో పాటు దర్శకుడి పనితనం నచ్చేసిందని పొగిడేస్తున్నారు. అంతేకాదు.. కొందరైతే కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ సినిమా! అంటూ పొగిడేయడం షాకిచ్చింది.

లేటెస్టుగా తమిళనాడులో ఓ క్రౌడీ థియేటర్ కి అమలాపాల్ మారు వేషంలో వెళ్లి తాను మీడియా ప్రతినిధిగా పరిచయం చేసుకుని ప్రేక్షకుల్ని ఇంటర్వ్యూలు చేసింది. వైట్ టీషర్ట్ వేసుకుని జర్నలిస్టుగా మారిన అమలాపాల్ తలపై క్యాప్ .. కళ్లద్దాలు ధరించి కన్ఫ్యూజ్ చేసింది. తనని అక్కడ ఎవరూ గుర్తు పట్టనేలేదు. ప్రేక్షకులంతా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వెళుతూ `ఆడై రుంబ నల్లా ఇరుక్కు!` అంటూ తెగ పొగిడేశారు. అయితే అలా పొగిడేసిన ఓ అభిమాని తనని ఇంటర్వ్యూ చేసింది అమలాపాల్ అని తెలుసుకుని షాక్ కి గురైంది. అమలా క్యాప్ తొలగించి ఫ్యాన్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. అమలాపాల్ స్వయంగా ఇన్ స్టాలోనూ షేర్ చేయడంతో `కామిని ఈజ్ బ్యాక్!` అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. సౌత్ సినిమాలపై నా దృక్పథాన్ని మార్చావు అమలా.. మెస్మరైజింగ్ పెర్ఫామన్స్.. ఐడియల్ రోల్ మోడల్ ఫర్ ఎవ్వెరి వన్… లవ్ యు! అంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశారు వేరొక వీరాభిమాని. ఇలాంటి బోల్డ్ సినిమాలు మరిన్ని చేయాలని కొందరు అభిమానులు కోరారు. మొత్తానికి ఈ ఊపులో ఆడై సీక్వెల్ లోనూ అమలా నటించేస్తుందేమో!
Please Read Disclaimer