ఆ జోనర్ లో పడి పోయిన అమలా పాల్

0

తెలుగు మరియు తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మలయాళి ముద్దు గుమ్మ అమలాపాల్. ఈ అమ్మడు హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లో దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది. ఆయన తో చాలా తక్కువ కాలంలోనే విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాని ఆమె చేసిన కమర్షియల్ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం అవుతున్నాయి.

కమర్షియల్ సినిమాల ను పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాల ను చేయాలని అమలా పాల్ నిర్ణయించుకుందనిపిస్తుంది. ఎందుకంటే ఈమె వరుస గా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. ఆడై సినిమా లో ఓ రేంజ్ లో బోల్డ్ గా నటించిన అమలా పాల్ మరోసారి అలాంటి పాత్రనే చేసింది. అడవి నేపథ్యం లో రూపొందిన లేడీ ఓరియంటెడ్ చిత్రంతో అమలాపాల్ త్వరలో ప్రేక్షకుల ముందు కు వచ్చేందుకు సిద్దం గా ఉంది.

అదో అంద పార్వై పొల అనే టైటిల్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అమలాపాల్ నటించింది. ఇందు లో అమలా ద్విపాత్రాభినయం చేసినట్లు గా టాక్ వినిపిస్తుంది. అమలా పాల్ ఈ చిత్రం లో యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్లు గా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. హీరోల కు జోడీ గా ఈ అమ్మడికి అవకాశాలు రాక పోవడంతో చేసేది లేక ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తోంది. ఇకపై కూడా అదే జోనర్ లో అమలా పాల్ సినిమాలు చేసే అవకాశం ఉందని.. కమర్షియల్ పాత్రలు ఈమెకు రావడం అనుమానమే అనే కామెంట్స్ వస్తున్నాయి.
Please Read Disclaimer