హీరోయిన్ మాజీ భర్తకు పెళ్లయ్యింది

0

తమిళ దర్శకుడు విజయ్ మరియు హీరోయిన్ అమలాపాల్ లు దాదాపు నాలుగు ఏళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి రెండు సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు ప్రేమించుకున్నంత కాలం కూడా కలిసి ఉండలేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు సంవత్సరంకే గొడవల కారణంగా విడిపోయారు. వీరికి 2017లో అధికారికంగా విడాకులు వచ్చాయి.

విడాకుల తర్వాత ఇద్దరు కూడా సినిమాలతో బిజీ అయ్యారు. అమలా పాల్ హీరోయిన్ గా వరుసగా చిత్రాలు చేస్తూ ఉంటే విజయ్ కూడా వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు. ఇలాంటి సమయంలోనే విజయ్ రెండవ పెళ్లి చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ రెండవ పెళ్లి చేసుకున్నట్లుగా అధికారికంగా క్లారిటీ కూడా వచ్చేసింది. విజయ్ రెండవ పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా రివీల్ అయ్యాయి.

కొన్ని రోజుల క్రితం విజయ్ తన రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. డాక్టర్ ఆర్ ఐశ్వర్యను తాను వివాహం చేసుకోబోతున్నాం. జులైలో తమ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా జరుగబోతుంది. నా జీవితంలో కొత్త భాగం మొదలు కాబోతుందని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే పెళ్లి చాలా సైలెంట్ గా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన రెండు మూడు రోజులకు ఈ ఫొటోలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. విజయ్ కొత్త జీవితం బాగుండాలని ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రస్తుతం విజయ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ బయోపిక్ లో నటించేందుకు కంగనాను విజయ్ ఒప్పించాడు. ఇటీవలే అభినేత్రి 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. పెళ్లితో చిన్న గ్యాప్ తీసుకుని వచ్చే నెల నుండి జయలలిత బయోపిక్ మొదలు పెట్టే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Please Read Disclaimer