తమన్నా పెళ్లికి ప్రిపేరవుతోందా.. ఇదే హింట్!

0

ప్రతిభతో పాటు గ్లామర్ యాంగిల్ కథానాయికలకు తప్పనిసరి. ఇవన్నీ ఉంటేనే హీరోయిన్లని చూసేందుకు ఆడియెన్ ఇష్టపడతారు. ముఖ్యంగా మాస్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటి హీరోయిన్లనే తమ సినిమాల్లోకి తీసుకుంటారు దర్శక నిర్మాతలు. మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ కంటే తన రంగుతోనే అవకాశాలను దక్కించుకుందనే విమర్శ ఆరంభ రోజుల్లో ఉండేది. కాలక్రమంలో నటిగానూ పరిణతి చెందింది. ఇక ఇటీవల మెరుపు డ్యాన్సులతో.. మిల్కీ అందాలతో కవ్వించేస్తూ అవకాశాలు ఒడిసిపడుతోంది. ఫేడవుట్ అవుతోంది అనగానే.. కంబ్యాక్ అవ్వడం ఆసక్తికరం. గతేడాది `ఎఫ్2`తో విజయాన్ని అందుకుంది. సైరా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే అటుపై పలు సినిమాలు చేసినా విజయం సాధించలేకపోయాయి.

అయితే తమన్నా ప్రముఖ మేగజైన్ల కోసం పోజులివ్వడం మిగతా హీరోయన్లతో పోలిస్తే కాస్త తక్కువనే చెప్పాలి. ఫిదా చేసే బాడీ కొలతలున్నా కవర్ పేజీ షూట్ లతో రెచ్చిపోయిన సందర్భాలు అరుదు. తాజాగా ఆమె ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వెడ్డింగ్ వావ్స్’ మేగజీన్ కోసం డిఫరెంట్ స్టయిల్ లో.. డిఫరెంట్ గెటప్స్ లో పోజులిచ్చి ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందరిలా అందాల ఆరబోతతో రెచ్చిపోకుండా.. ట్రెండీ డ్రెస్సులతో మెస్మరైజ్ చేసింది.

ఓ ఫోటోలో లైట్ పింక్ కలర్ సారీ ధరించి.. ఫ్లోరల్ డిజైన్ తో కూడిన వైట్ కలర్ కోట్ ఓ చేతికి తగిలించుకుని.. బ్లూ కలర్ కోటింగ్ తో వేసుకున్న ఐ షాడోతో ఆద్యంతం స్టయిలీష్ గా ఓ లుక్ లో తమన్నా కనిపించింది. అలాగే మరో పింక్ కలర్ సారీ ధరించి.. బ్లాక్ కలర్ కి సిల్వర్ కోటింగ్ తో కూడిన కోట్ తో మరో ఫోటో… అలాగే రెడ్ & గోల్డ్ కలర్ రింగ్స్ తో డిజైన్ చేసిన షర్ట్ ధరించి పోజులిచ్చింది. ఈ మూడు రకాల గెటప్స్ తో కూడిన ఫోటోలను తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. వంపు సొంపులతో తన నడుమందాన్ని చూపిస్తూ అలరిస్తుంది. సన్నని నడుముకి ఫిట్ ఎలివేషన్ తో తమన్నా కొత్త లుక్ లోకి మారిపోయింది. మూడు వేరియేషన్స్ లో తమన్నా ఫోటో షూట్ని చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.

స్టయిలిష్ లుక్ కి తమన్నా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వాటే బ్యూటీ అంటూ ట్యాగ్స్ ఇస్తున్నారు. ఫోటోషూట్ కోసం మంచి ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో ‘డాంగ్ డాంగ్’ పాటలో స్టెప్పులేసి అందరిని మాయ చేసింది. ఇప్పుడు తెలుగులో గోపీచంద్ సరసన `సీటీమార్`లో.. హిందీలో `బోల్ చుడియన్` చిత్రంలో నటిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-