వావ్ అనిపించిన సామ్

0

ఈ జెనరేషన్ హీరోయిన్లలో సమంతా రూటే సపరేటు. ఒక హీరోయిన్ కనుక సౌత్ లో శ్రీమతి అయిందంటే చాలు.. వారికి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కేవి కాదు. అలాంటి ట్రెండ్ ను మార్చి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కాదు హిట్స్ కూడా సాధించింది. సమంతా బాటలో ఫ్యూచర్ లో మరికొందరు నడుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదొక్కటే కాదు.. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఎంచుకునే సమయంలో కూడా కథకు ప్రాధాన్యత.. తన పాత్రలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంది. తాజాగా సమంతా నటించిన ‘ఓ బేబీ’ అలాంటి సినిమానే.

త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో తన బ్రైట్ డ్రెస్ తో.. సాటిలేని గ్రేస్ తో.. గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సమంతా. రెడ్ కలర్ డ్రెస్.. మెడలో ముత్యాల దండతో సింపుల్ గా కనిపించినా స్పెషల్ అట్రాక్షన్ మాత్రం సమంతానే. ఊరికే సమంతాను పొగుడుతున్నామని మంచు లక్ష్మి అభిమానులు కినుక వహించాల్సిన పని లేదు. ఆమె కూడా తనదైన స్టైల్ లో అందరినీ మెప్పించింది.

నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ జులై 15 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. నాగ శౌర్య.. లక్ష్మి.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
Please Read Disclaimer