అవాక్కయ్యేలా ఉన్న మహేష్ మల్టీప్లెక్స్ లెక్కలు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా మరియు వ్యాపారవేత్తగా కూడా మహేష్ బాబు మారిన విషయం తెల్సిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను సంవత్సరం క్రితం ప్రారంభించిన విషయం తెల్సిందే. అంతకు ముందు వరకు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ అంటే ప్రసాద్స్ లేదంటే పీవీఆర్. కాని ఎప్పుడైతే మహేష్ బాబు రంగంలోకి దిగాడో సీన్ మొత్తం మారింది.

ఏఎంబీ సినిమాస్ కు సెలబ్రెటీల నుండి చిన్న స్థాయి వారు వరకు అంతా క్యూ కట్టారు. దాంతో ఏడాదిలోనే నెం.1 స్థానంలో నిలిచింది. నిన్నటితో ఈ మల్టీప్లెక్స్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తమ మల్టీప్లెక్స్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు టీం ఏఎంబీ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్బంగా మహేష్ బాబు వెళ్లడించిన ఘనాంకాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.

ఏడాది కాలంలో ఏఎంబీ సినిమాస్ లో మొత్తం 310 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తంగా 12755 షోలను వేశారు. ఇక ఈ ఏడాది కాలంలో రెండు మిలియన్ ల మంది ప్రేక్షకులు సినిమాను చూశారు. అంటే 20 లక్షల టికెట్లు కట్ అయినట్లుగా మహేష్ బాబు ప్రకటించాడు. అంటే యావరేజ్ గా రోజుకు అయిదువేలకు పైగానే ప్రేక్షకులు ఏఎంబీని సందర్శించడం అందులో సినిమాను చూడటం జరిగిందన్నమాట. హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ స్థాయిలో రోజు వారి యావరేజ్ వచ్చి ఉండదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు బ్రాండింగ్ తో పాటు అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్స్ తో మల్టీ ప్లెక్స్ నిర్మాణం చేపట్టడం వల్ల కనీసం ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందుకే మొదటి ఏడాదిలోనే రెండు మిలియన్ ల టికెట్లు తెగాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఏఎంబీలో విడుదలైన అన్ని సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఏఎంబీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతుండటంకు కారణం ఇదే.
Please Read Disclaimer