క్వారంటైన్ లో నాకు ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది – స్టార్ హీరో కూతురి కామెంట్స్

0

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో కావాల్సినంత టైం దొరికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో చిట్‌చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఎవరితో డేటింగ్ చేయాలనుకొంటున్నావని అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న నాకు ‘దంగల్’ భామ సన్యా మల్హోత్రాతో డేటింగ్ చేయాలని ఉంది. ముందుగా వెంటనే ఆమెను లైన్లోకి తీసుకురండి అంటూ ఇరా సమాధానం ఇచ్చింది. ఆమెతో సరదాగా మాట్లాడుతూ ముచ్చటించుకొంటే భలే ఆనందంగా ఉంటుందని చెప్పింది. సన్యాతో ఉంటే సమయమే తెలియదు. మా మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే నా స్నేహితురాలి తో ఉండాలని అనుకంటున్నాను అని ఇరా ఖాన్ చెప్పింది. ఇదిలాఉండగా ఇరాఖాన్ ఇప్పటికే ఓ మ్యూజిక్ డైరెక్టర్‌తో అఫైర్ కొనసాగిస్తున్నదనే వార్తలు మీడియా లో వస్తూనే ఉన్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-