నాకు యాక్సిడెంట్ కాలేదు మొర్రో అంటున్న హాటు ఆంటీ!

0

ఒక సెలబ్రిటీకి యాక్సిడెంట్ అని ఫేక్ వార్తలు ప్రచారం చేయడం.. ఒక్కోసారి చనిపోయారని కూడా రూమర్లు స్ప్రెడ్ చేయడం అనేది ఒక జాడ్యంగా తయారైంది. సోషల్ మీడియా జెనరేషన్ కదా.. వార్తలు చాలా ఫాస్ట్ గా అందరిని చేరతాయి. దీంతో జరిగింది నిజమేనా లేదా అని తెలుసుకునేలోపే చావు వార్తలను కొందరు నమ్మేస్తారు. వాటిని నమ్మిన జనాలు శ్రద్ధగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. స్టైలుగా RIP మెసేజులు పెడతారు.

తాజాగా అలాంటి సందర్భమే బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కు ఎదురైంది. మరీ చనిపోయిందని వార్త రాలేదు కానీ ‘అమీషా ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిందని.. తీవ్రగాయాలతో అమీషా ఐసీయూ లో ఉందని’ ఎక్కడో ఒక వార్త వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వార్తకు ఒక ప్రూఫ్ అన్నట్టుగా యాక్సిడెంట్ అయిన ఒక కారు ఫోటోను కూడా ఆ వార్తకు జోడించారు. ఆ కారు నుజ్జునుజ్జుగా కనిపించడంతో అమీషా అభిమానులు .. శ్రేయోభిలాషులు చాలామంది కంగారుపడ్డారు. ఫోన్ల మీద ఫోన్లు.. మేసేజులు పెట్టారు. ఈ దెబ్బతో అమీషాకు తలప్రాణం తోకకు వచ్చిందట. దీంతో తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొత్త ఫోటోలు పోస్ట్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపింది. “నాకు అసలు కార్ యాక్సిడెంట్ కాలేదు. నేను క్షేమంగా ఉన్నాను. మీరు నా గురించి అందోళన పడకండి. మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. అయినా ఇలాంటి పుకార్లు ఎవరు ప్రచారం చేస్తారో నాకు అర్థం కాదు” అంటూ తన వెర్షన్ వినిపించింది.

ఇంతకీ ఈ అమీషా ఎవరంటే హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిం ‘కహో న ప్యార్ హై’ సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ. తెలుగులో పవన్ సినిమా ‘బద్రి’.. మహేష్ సినిమా ‘నాని’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ 40+ భామకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు పెద్దగా లేవు కానీ హాటు ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ రూమర్ తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.




Please Read Disclaimer