ప్రార్థనలు అయ్యాక సెక్స్ చేయడం ఇష్టం: నటి

0

దేవుడా.. ఇదేం అరాచకం. ప్రార్థనలు ముగిసిన తర్వాత సెక్స్‌లో పాల్గొంటానని పబ్లిక్‌గా వెల్లడించేసింది. ప్రముఖ అమెరికన్ నటి ఆష్లే గ్రహం ఇటీవల ఇండో కెనడియన్ యూట్యూబర్ లిల్లీ సింగ్ హోస్ట్ చేస్తున్న ‘ఎ లిటిల్ లేట్ విత్ లిల్లీ సింగ్’ షోలో పాల్గొంది. ఈ షోలో సిగ్గు విడిచి అన్ని విషయాలు చెప్పేసింది. ‘నాకు, నా భర్త జస్టిన్ ఎవ్రిన్‌కు జీసస్‌పై, నేను చేసే ప్రార్థనలపై ఎంతో నమ్మకం ఉంది. మేం ప్రార్థనా వేళల్లో తప్పకుండా చర్చికి వెళుతుంటాం. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి సెక్స్‌లో పాల్గొంటాం. ఇందులో తప్పులేదు. ఎందుకంటే ప్రార్థన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సెక్స్ శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఈ విషయంలో మా ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది’ అని వెల్లడించింది.

ఈ మాట వినగానే లిల్లీ సింగ్ షాకైంది. ‘అయితే నేను కూడా ఓ రాత్రి ప్రార్థన చేయాలన్న మాట’ అని వెటకారంగా కామెంట్ చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ అమెరికన్ సింగర్ కాన్యే వెస్ట్ కూడా సెక్స్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పెళ్లికి ముందు సెక్స్ వద్దని ఆయన చెప్పిన మాటలు హాలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. ‘నా వద్ద పనిచేస్తున్న వారికి ఓ రూల్ పెట్టాను. అదేంటంటే.. పనిలో ఉన్నప్పుడు సెక్స్ చేయకూడదు. అంతేకాదు పెళ్లికి ముందు సెక్స్ అస్సలు వద్దు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఉపవాసం చేయాలని కూడా చెబుతుంటాను. నాకు ఐదేళ్ల వయసున్నప్పుడే నేను సెక్స్‌కు అడిక్ట్ అయ్యాను. ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు పోర్న్‌కు అలవాటు పడ్డాను. ఈ దరిద్రమైన హ్యాబిట్ నుంచి బయటపడేయడానికి మా నాన్న నాకు చాలా సాయం చేశాడు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను పూర్తిగా ఈ అలవాటు నుంచి బయటపడ్డాను’

‘బహుశా రాక్‌స్టార్ల లైఫ్ ఇలాగే ఉంటుందేమో. తల్లి చనిపోతే ఎవ్వరూ ఆ బాధను తట్టుకోలేరు. కొందరైతే ఆ బాధ నుంచి తేరుకోవడానికి డ్రగ్స్‌కు అలవాటుపడుతుంటారు. కానీ నేను సెక్స్‌కు అలవాటుపడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే జీసెస్ నా జీవితాన్ని మార్చేశాడు. ఆయన నాకు ఎంతగా సాయపడ్డాడో నా అభిమానులకీ తెలియజేయాలనుకుంటున్నాను. నేనేదన్నా కొత్త పాట రాయాలనుకున్నప్పుడు నా వద్ద పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లి కేవలం ఈ పని మీద మాత్రమే ఫోకస్ చేయండి అని చెప్తుంటాను. ఎందుకంటే కలిసి దేవుడిని ప్రార్థించేవారు కలిసి ఏదైనా సాధించగలరు’ అని తెలిపాడు కాన్యే వెస్ట్.
Please Read Disclaimer