అమీర్ ఖాన్ డాటర్ దర్శకత్వం

0

పాత నీరు పోయి కొత్త నీరు రావాలన్నది సామెత! ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే ఖాన్ లకు విశ్రాంతి అవసరం కనిపిస్తోంది. వారసుల టైమ్ స్టార్టవ్వడం అత్యావశ్యకం అన్నది స్పష్ఠమవుతోంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్ త్వరలోనే డెబ్యూ కథానాయికగా బరిలో దిగుతోంది. ఈలోగానే ప్రీప్రిపరేషన్ కోసం లఘు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు నటనలోనూ శిక్షణ తీసుకుంటోంది. ఇదిలా ఉండగానే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వారసురాలు ఐరా ఖాన్ నుంచి సరికొత్త ప్రకటన వెలువడింది.

సుహానా తరహాలో ఐరా ఖాన్ నటనలోకి ప్రవేశించడం లేదు. ఈ భామ దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. అయితే ఒక ఫీచర్ ఫిలిమ్ ని డైరెక్ట్ చేసే ముందే ప్రీప్రాక్టికల్స్ కూడా చేస్తోంది. ముందుగా స్టేజీ డ్రామాకు దర్శకత్వం వహించనుందట. అందుకోసం ఓ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించింది. ఐరా నిర్వహిస్తున్న థియేటర్ ప్రొడక్షన్ పేరు `యూరిపైడ్స్ మీడియా`. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎంచుకున్న థియేటర్లలో ఐరా దర్శకత్వం వహించనున్న స్టేజీ డ్రామాను ఈ కంపెనీ ప్లే చేయనుంది. ఇక స్టేజీ ప్లే కోసం తాను ఎంచుకున్న కాన్సెప్టు ఏమిటి? అంటే .. ఓ గ్రీక్ కథాంశం నుంచి స్ఫూర్తి పొంది డ్రామాకు స్క్రిప్టును రాసుకుందట. నవంబర్ నాటికి పూర్తిగా స్క్రిప్టు సహా అన్నిటినీ సిద్ధం చేస్తోంది.

ఈ సందర్భంగా ఐరా మాట్లాడుతూ.. “థియేటర్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్టేజీ డ్రామాకు దర్శకత్వం వహించడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆ అనుభవం ఎంతో మ్యాజికల్ గా ఉంటుంది“ అని తెలిపింది. ఇటీవలే తన లైఫ్ లో ఏం చేయాలనుకుంటుంది? అన్నదానిపై వోరల్ గా సమాధానం ఇవ్వకుండా ఓ ఫోటో షూట్ ద్వారా ఐరా కొత్త డెఫినిషన్ ఇచ్చింది. మనసులోని భావాల్ని ఫోటోషూట్ లో వ్యక్త పరిచానని ప్రతిసారీ తాను ఏం కావాలనుకుంటున్నానో తనని తాను ప్రశ్నించుకుంటానని ఐరా వేదాంత ధోరణిని కనబరచడం ఆసక్తిని కలిగించింది.
Please Read Disclaimer