ఖాన్ వారసురాలు ప్రేమకథ

0

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ని మీడియా నిరంతరం వెంటాడుతుందన్న సంగతి తెలిసిందే. షారూక్- గౌరీఖాన్ జంట వారసులు సుహానా ఖాన్ .. ఆర్యన్ ఖాన్ .. సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ జంట వారసుడు తైమూర్ అలీఖాన్.. సైఫ్- అమృత వారసురాలు సారా అలీఖాన్.. వీళ్లతో పాటే పలువురు సెలబ్రిటీ కిడ్స్ కి నిరంతరం మీడియా అటెన్షన్ తప్పనిసరి. వారసుల వ్యక్తిగత వ్యవహారాలపైనా బాలీవుడ్ మీడియా తామర తంపరగా అప్ డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఇక ఈ జాబితాలో తాజాగా అమీర్ ఖాన్ వారసురాలు ఐరా ఖాన్ పేరు చేరింది.

ఐరాఖాన్ తండ్రి అడుగు జాడల్లో నటవారసురాలు అవుతుందా? అంటే తాను ఫిలింమేకర్ అవ్వాలనుకుంటోందని అమీర్ ఖాన్ గతంలో వెల్లడించారు. ఇకపోతే ఐరాఖాన్ వ్యక్తిగత జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువే. ఐరా ఇప్పటికే డేటింగ్ లో ఉన్నానని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. మిషాల్ అనే స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. తాజాగా ఈ ప్రేమ జంట అపురూపమైన అనుబంధానికి సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలోకి విడుదలైంది. ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దృశ్యం ప్రేమికులకు కొత్త గోల్స్ ని నిర్ధేశిస్తోంది.

ఐరా ఇటీవల సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంది. నిరంతరం తన ఫోటోలు- వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. భవిష్యత్ లో ఫిలింమేకర్ అవుతానని ప్రకటించిన ఐరా తండ్రిలానే ఎంతో వైవిధ్యమైన సినిమాల్ని రూపొందిస్తుందనే భావిద్దాం. అమీర్ తదుపరి వరుసగా సినిమాల నిర్మాణానికి సిద్ధమవుతున్నారు కాబట్టి సొంత బ్యానర్ బాధ్యతల్ని ఐరా ఖాన్ చక్కబెడుతుందనే భావించవచ్చు. దంగల్.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తర్వాత అమీర్ కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. టామ్ హ్యాంక్స్ నటించిన 1994 సెన్సేషనల్ మూవీ ది ఫారెస్ట్ గంప్ రీమేక్ లో నటించేందుకు అమీర్ ప్రిపరేషన్ లో ఉన్నారు.
Please Read Disclaimer