నాటీ పోజులు మానని 42 ఏళ్ళ బ్యూటీ

0

గతంలో హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిన తర్వాత మీడియాలో అసలు కనిపించేవారు కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే తప్ప మీడియాలో వారికి కనీసం స్పేస్ దక్కేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని భామలందరూ ఫుల్ గా లైమ్ లైట్ లో ఉంటున్నారు. నలభైలలో ఉన్నా ఫిట్నెస్.. హాట్ నెస్ మెయింటైన్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్న భామల్లో అమీషా పటేల్ ఒకరు.

హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిం ‘కహో న ప్యార్ హై’ సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులో పవన్ సినిమా ‘బద్రి’ లో కూడా హీరోయిన్ గా నటించింది. మొదట్లో మంచి విజయాలే దక్కాయి కానీ గత కొన్నేళ్ళుగా సక్సెస్ లేకుండా పోయింది. కానీ సినిమా అవకాశాలతో.. జయాపజయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తూ ఉంది అమీషా. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఎండాకాలం సూర్యుడు.. చల్లదనం కోసం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో కొబ్బరి బొండాంలో స్ట్రా వేసి తాగుతూ.. ఓర కంట చూస్తున్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. గాగుల్స్ కిందకు పెట్టి ఆ గ్యాప్ లో నుంచి చూడడం సెక్సీగానే ఉంది. ఆమె చూసే అల్లరి చూపు “మీరు ఎక్కడ చూస్తారో నాకు తెలుసు” అన్నట్టుగా ఉంది. తనేమో కూల్ గా కోకోనట్ వాటర్ తాగుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచడం ఏంటో!

ఫోటో సెక్సీగా ఉంది.. బ్యూటీ కూడా నాటీగా ఉంది. కానీ ఈ ఫోటోకు కామెంట్లే లేవు. లైక్స్ మాత్రం 118k ఉన్నాయి. అంటే… ఈ జనరేషన్ నెటిజన్లు ఈ నలభైల భామతో డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మరి తన చుట్టూ వైఫై పెంచుకొని వారికి మళ్ళీ కనెక్ట్ కావాలంటే మలైకా అరోరా లాంటి నలభైల బ్యూటీలను ఫాలో అవ్వాలి. అప్పుడే ఆ కిటుకు తెలుస్తుంది. లేకపోతే కొన్ని రోజుల తర్వాతా ఈ లైక్స్ కూడా రావు! ఈ సంగతేమో కానీ అమీషా ప్రస్తుతం ‘దేశి మ్యాజిక్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.Please Read Disclaimer