ముంబై జంబల్ హాట్

0

బిజీగా ఉన్న సమయంలోనే సోషల్ మీడియా పై గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే బాలీవుడ్ భామలు ఇప్పుడు పనీ పాట ఏమాత్రం లేని సమయంలో ఎలా ఊరుకుంటారు? అందుకే పాత ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ ను మరింత కలర్ఫుల్ గా మారుస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ భామ అమీషా పటేల్ కూడా ఉంది. ఈ లేటు భామ వయసు 43 అయితే ఫిట్నెస్ మాత్రం పాతిక సంవత్సరాల భామ తరహాలో మెయిన్టెయిన్ చేస్తూ ఉంటుంది.

ఇండియా అంతా లాక్ డౌన్ కాబట్టి ఈ భామ కూడా ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుని ఏకాంతం ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటించింది కానీ ఈ భామ మనసును ఏ మగ మహారాజు కూడా మీటలేకపోయాడు. ఈ లెక్కన ఆడ సింహం సింగిల్ గానే ఉంటూ ఇన్స్టా గ్రామ్ లో ఇన్నోసెంట్ నెటిజన్లను నిద్రకు దూరం చేస్తూ ఉంటుందని అనుకోవాలి. ఈమధ్య మరోసారి ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అమీషా ఒక వైట్ టీ షర్టు.. బ్లూ కలర్ మినీ ధరించి ఎంతో స్టైలిష్ గా నిలుచుంది. ఆ మినీ సైజ్ నానో మీటర్లలో ఉండి.. మెల్ బాడీస్ టెంపరేచర్ ను ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెంచేలా ఉంది. ఫిమేల్ బాడీస్ లో అసిడిటీని ఒకే దెబ్బకు పెంచేలా ఉంది.

అయినా ఈ కరోనా జమానాలో జనాలు ఇంట్లో కూర్చుని క్రికెట్ లైవ్ స్కోర్ తరహాలో ఎన్ని బాల్స్.. ఎన్ని రన్స్.. ఎన్ని వికెట్స్ లాగా ‘కరోనా స్కోర్’ ను తెలుసుకుంటూ.. టైం పాస్ చేస్తూ బాధ పడుతూ.. ఆందోళన చెందుతూ అదోరకమైన మానసిక స్థితిలో.. కక్కలేక మింగలేక అన్నట్టుగా.. రెండు గుక్కలు కూడా బిగించలేక యమా ఇరకాటంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో తన గ్లామర్ తో జనాలను అమీషా ఇలా ఎంటర్టెయిన్ చెయ్యడం ఓ రకమైన సామాజిక సేవ అనుకోవాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-