వయసు మీద పడుతున్నా ఊరుకోదే!

0

హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిం ‘కహో న ప్యార్ హై’ సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ అమీషా పటేల్. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘బద్రి’.. మహేష్ బాబు ‘నాని’ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు వయసు 43. సినిమాలు చేతిలో లేవు. అయినా సోషల్ మీడియాలో జోరు మాత్రం అసలు తగ్గలేదు. ఇప్పటికీ కఠిన కసరత్తులు చేస్తూ ఇరవై ల భామలా కనిపించేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “అందరూ పచ్చవి తింటారు..నేను వేసుకుంటాను” అంటూ ఒక ఇల్లాజికల్లీ లాజికల్ క్యాప్షన్ ఇచ్చింది. ఆకుపచ్చ టాప్.. అదే రంగు షార్ట్ ధరించి తన అందాలను వీలైనంతగా ధారపోస్తూ ఓకే ఫసాక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఎర్ర రంగు లిప్ స్టిక్.. బ్రౌన్ హెయిర్ కలర్ తో మోడరన్ గా కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఫిట్నెస్ సూపర్ గా ఉంది సెక్సీగా కనిపిస్తోంది కానీ మొహంలో మాత్రం వయసు తెలిసిపోతోంది. అప్పటికీ జంబో గాగుల్స్ ధరించి మరీ ఫోటోలకు పోజిచ్చింది.

అయితే ఈ ఫోటోకు కామెంట్లు ఒక్కటి కూడా లేవు. లైక్స్ మాత్రం 31k ఉన్నాయి. దీనర్థం ఈ భామను ఈతరం నెటిజన్లు పెద్దగా పట్టించుకోవడమ లేదు అనుకోవాలి. వారిని ఆకర్షించాలంటే బిగ్ బాస్ కొత్త సీజన్లోనో.. ఖత్రోం కా ఖిలాడి లాంటి రియాలిటి షోలోనో లేకపోతే లస్ట్ సీరీస్ 10 లో భాగం కావాలి. అప్పుడే ఈ జెనరేషన్ నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే బద్రి టైం యువతలో చాలామంది ఇప్పటికే సంసార లంపటంలో పడి విలవిలలాడుతూఉంటారు..!
Please Read Disclaimer